ఆ అబ్బాయికి ఎప్పుడూ తనకు గొప్ప శక్తులు ఉండాలనీ , ఈ లోకాన్ని కాపాడాలనీ ,అందరూ తనని పొగడాలనీ ఒక కోరిక ఉండేది. కానీ ఆ అబ్బాయి ఎప్పుడూ తన కోరిక గురించే ఆలోచించే వాడు.
అతని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా ఆ అబ్బాయికి
" అది ఎలాగు తీరని కోరిక . నువ్వు బాగా చదువుకొని ఏ కలెక్టరో ఇంజనీరో అయితే అందరూ నిన్నే పొగుడుతారు .కాబట్టి నువ్వు బాగా చదువుకో" అని ఎన్నో సార్లు చెప్పి చూశారు.
అయినా లాభం లేదు.
కానీ ,వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఆ అబ్బాయిని ఎలాగైనా మార్చాలనుకొంటారు. బాగా ఆలోచిస్తారు .వాళ్ళకు ఒక ఉపాయం తట్టింది.
అది అలా ఉండగా ,ఆ అబ్బాయి రోజూ దేవుణ్ణి అద్బుతశక్తుల కోసం ప్రార్ధించడం మొదలు పెట్టాడు.
ఒక రోజు వాళ్ళ అమ్మానాన్న వచ్చి ఆ అబ్బాయితో ,"మేము తీర్ధ యాత్రలకు వెళుతున్నాము .నువ్వు ఇంట్లోనే ఉండు " అని చెప్పి తీర్ధయాత్రలకు వెళ్ళిపోతారు .
ఒక రోజు వాళ్ళ అమ్మానాన్న వచ్చి ఆ అబ్బాయితో ,"మేము తీర్ధ యాత్రలకు వెళుతున్నాము .నువ్వు ఇంట్లోనే ఉండు " అని చెప్పి తీర్ధయాత్రలకు వెళ్ళిపోతారు .
అలా అని వాళ్ళు నిజంగా వెళ్ళలేదు .వారిద్దరూ ఒక సాధువు ,భక్తురాలిగా వేషం మార్చుకొని ,తిరిగి వాళ్ళ ఊరు వస్తారు.
ఊరికి ఎవరో సాధువు వచ్చారని ఎవరో చెపితే రాము విన్నాడు.
వెంటనే ఆ సాధువు వద్దకు వెళ్ళాడు రాము.వెళ్ళి ఆ సాధువుతో తన కోరికను చెప్తాడు. దానికి ఆ సాధువు "నువ్వు రెండేళ్ళు కష్టపడి చదువు అప్పుడు నీకే అద్భుతశక్తులు వస్తాయి "అని చెప్పాడు.
ఆ అబ్బాయి సరేనని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు.
అప్పటినుంచీ ప్రతి రోజు కష్టపడి చదువుకొంటూ ఉంటాడు . వారం రోజుల తరువాత వాళ్ళ అమ్మానాన్న వస్తారు. అప్పటికే రాము చదువుకొంటూ ఉంటాడు. వాళ్ళు చేసిన కృషి ఫలించినందుకు వారు ఎంతో సంతోషించారు.
అయితే వారు ఇంటికి రాగానే ," అమ్మానాన్న రండి రండి " అంటూ వారిని ఇంట్లోకి ఆహ్వానించి ,జరిగిన విషయమంతా చెప్పాడు.
రెండేళ్ళు బాగా చదివాడు. అయితే ప్రతిసారీ ,క్లాసులో తనే ఫస్టు వచ్చేవాడు.అయితే రెండేళ్ళు అయ్యేసరికి ఆ అబ్బాయికి అద్భుత శక్తుల గురించి ఏదీ గుర్తు లేదు .
బాగా చదివి గొప్పవాడయ్యాడు .
బాగా చదివి గొప్పవాడయ్యాడు .
అందరూ అతనిని పొగడసాగారు.
ఒక రోజు అతనికి తన కోరిక గురించి గుర్తొచ్చింది.అప్పుడు సాధువు అన్న విషయం పూర్తిగా అర్ధమైంది. తన చదువు తన ఉద్యోగం వలన అందరూ అతనిని పొగుడుతున్నారు. అవే అతని అద్భుత శక్తులు అని తెలుసుకొన్నాడు.
***
K. శ్రీ సాయి సుమ స్మిత,
7 వ తరగతి,
బాలోత్సవ్- 2009, కథారచన, జూనియర్స్, ప్రథమ బహుమతి
***
డా. వాసిరెడ్డి రమేష్ గారు మరియు ఇతర పిల్లల శ్రేయోభిలాషులు, కొత్తగూడెం క్లబ్,కొత్తగూడెం వారికి నమస్సులతో
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.
2 comments:
soooo cute for such a little brain. May god bless you
positive vuuha baagundi.
Post a Comment