నిండా పంతొమ్మిదేళ్ళు రాని వయసులో రాయడం మొదలెట్టి ,
ఈ కొద్దికాలంలోనే తన రాతలను ఒక పుస్తకరూపంలో అందుకొంటున్న ఆ క్షణాన
సుమను చూస్తే ఎంత ముచ్చటేసిందో !
ఆ పూట కార్యక్రమాన్ని తన స్నేహితురాలితో పాటు ,
తెలుగుతల్లికి మల్లెపూదండ వేసి ప్రారంభించినా,
వేదిక మీద కు రావడానికి బిడియ పడుతూ సిగ్గు పడుతూ ,
పాటలొలికిన ఆ నోటిలో మాటలు కరువయినట్లు,
ఆర్తిగా మప్పిదాలు పలికి
గబుక్కున వెళ్ళి తన కుర్చీలో కూచున్న వైనం ,
మన తెలుగు కతకు వేసిన సరికొత్త చిగురు పసిడి మొగ్గ లా తోచింది.
సుమకు అనేకానేక శుభాకాంక్షలు.
తనలానే అనేక సుమాలు మోసులెత్తి
తెలుగుకతమ్మవడి నింపాలని కోరుకుందాము.
***
దేవిశెట్టి పల్లి మాలగేరిలో ఒక పేద ఆలూమగలైన రామక్కకెంచప్పలకు పుట్టిన మా మునిరాజన్న కతలు రాసేది మొదులు పెట్టినంక ,ఆయనకనే ఒక మరియాదను నలుగుర్లో సంపాదించుకొన్నాడు.
అదంతా చూస్తా ఉంటే నాకు కూడా ఏదన్నా రాయాలనిపిచింది.
ఏమి రాయాల అని యోచనలో ఉంటే ,
మా మునిరాజన్న ఒక నాడు నాతో ,
" మన ఇండ్లల్లో చేసునే వంటల్ని రాయుమని చెప్పిండాడు రమేశయ్య ,
రాస్తావా బిడ్డా " అన్నాడు .
నేను ఎగిరి గంతేసి సరే అంటిని ,కాగితమూ కలమూ తీసుకొని మొదులు పెడితిని.
బిరబిర ఒబ్బట్ల వంటకము గురించి రాసి మా అన్న చేతిలో పెడితిని.
నేను రాసిండే దానిని చదవతా పడి పడీ నగుతా ఉండాడుమునిగాడు. నాకు రేగిపోయింది.
"ఏమయింది నా రాతలకి ఏల అట్లా నగేది,చెప్పి చావు " అని అరిస్తిని.
అపుడు చెప్పినాడు మా అన్న ," తిక్కల బిడ్డా,మా టీవి లో వచ్చే మా వూరి వంట చూసేసి
అదే మాదిరిగా రాసేస్తే ఎట్ల?"
నిజం చెప్పాలంటే నాకు వంట చేసేది అంత బాగా రాదు.
మా అమ్మా పిన్నమ్మా ఒదినలే మాఇంట్లో వంటచేసేది.అందుకే
ఈ కతల్లో వంట తక్కువ .మా అమ్మ బతుకే ఎక్కువ.
ఈ కతల్లో చానా వంటలకు కొలతలు చెప్పలేదు నేను.
కొలిచిచేసే వంటలు ఎట్లుంటాయో మీకూ తెలుసు . నాకూ తెలుసు.
నా పేరు ముందు ఉందే రామక్క ,ఆమే నన్ను కన్నతల్లి.
అబ్బ పేరునే మా పేరుకు ముందు పెట్టుకుంటాము.
నేను మా అమ్మ పేరు పెట్టుకొంటిని.
ఏలంటే అమ్మ లేక పొతే నేను లేను. నా పుటక లేదు.
నా చదువు లేదు. ఈ కతలు లేవు. మీతో చెప్పుకొనేకి ఇన్ని మాటలు లేవు.
అందుకనే ,మీ అట్లా పెద్దోళ్ళతో మాట్లాడే తెంపు కోసరమే పేరులో కూడా అమ్మను తోడు తెచ్చుకొంటిని.
ఇంతకీ మా వంటలు బాగుండాయో లేదో చెప్పనే లేదే మీరు !
రామక్క గారి సుమ
ముఖ చిత్రం : " పత్రచిత్రకారిణి " డా.లక్ష్మీ సుహాసిని
.
తన పుస్తకాన్ని కొని చదవడమే సుమకు మనమిచ్చే ప్రోత్సాహం !
సుమ పుస్తకం ప్రతులకు:
కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం,
2-1095, ఆవులపల్లి రోడ్,బస్తి,హోసూరు-635109,
కృష్ణగిరి జిల్లా,తమిళనాడు.
చేపలుకి :
స వెం రమేశ్ : (0) 8500548142
డా.అగరం వసంత్ (0)9488330209/ 7795094148
సుమ (0) 9715420303
ఉమా మహేశ్వరరావు 8985425888
***
ప్రభవ (0861)2333767/2337573
prabhava.bppks@gmail.com
Related Link : More Photos :http://chandralata.blogspot.in/2014/05/blog-post_24.html