"సూడండప్పా ఇనుకోండమ్మా. నేను ముంద్రే సెప్పతా ఉండా,
ఎవురు ఏమి ఎబుడు ,ఏడ అని నన్ను అడగొద్దండ,నడిసిండేది రాస్తా ఉండా ,
సదివితే సదవండా ఇంటే ఇనండా ,
నన్నేమన్నా అంటిరో ,నేను అర్దర్కులు నాయాలే కాదు ,
శానా తక్కువ నా కొడుకుని ... ఇట్లు ఈ కత రాసినోడు.
"యట్లెట్లా ఇంగో కీత సెపు సామీ ఆ సుద్ది " వక్కాకు నమలతా అనే మా అవ్వ .
"మోవ్ ! ఎన్ని కితాలు ఎట్లెట్ల సెప్పినా అదంతే.
శంబూకుడు తప్పుసేసే తబుసు సేసి. శీరాముడు వాని తలా నరికె" కోపముగా అనిరి సాములోళ్లు.
"ఇంత బిర్న కోపము సేసుకొంటే ఎట్ల సామీ!
మేము ఎన్ని యుగాలనింకా కోపము సేసుకోకుండా ఉండాము.
నిదానము .నిదానము సామీ " సున్నము నోట్లా యేసుకొని మాట్లాడే అవ్వ
( యట్లెట్లా! నుంచి)
రచయిత వైద్యుడు కదా.ఆయన వృత్తి నైపుణ్యాన్ని కూడా ఈ కతల్లో నింపిరి.
కొన్ని తావుల్లో చేదు మందులు మింగిస్తారు. కొన్ని తావుల్లో చురుక్కుమని సూదితో పొడుస్తారు.
కొన్ని తావుల్లో మలాము పూసి మెత్తని కట్టు కడుతారు.
పత్రికల తెలుగులో లేదు కదా అని ఈ కతలను పక్కకు పెట్టంద్దండీ. పత్రికల తెలుగు అద్దాల అరల్లోని అందాల బొమ్మ అయితే, తావు తెలుగు చెమటను చిందించి సాకే అమ్మ.
"మా తావు తెలుగు కాదు కదా " అని ముఖం చిట్లించకండి.
తెలుగు తల్లి కనిన గారాబు బిడ్డ మా హోసూరు తెలుగు.
మా తెలుగు తావి మిమ్మల్ని కమ్ముకొని జోకొడుతుంది.
నిజమైన మాట ఇది. నమ్మకం లేక పోతే మొదలు పెట్టి చూడండి.
నంద్యాల నారాయణ రెడ్డి (+91 9360514800)
***
నా తావుకి వచ్చే రోగులకి మందులిచ్చి పంపేయకుండా ,
బిడువు చేసుకొని రవంచ పొద్దు వాళ్ళతో మాట్లాడతా ఉంటాను.
అంతకు ముందర ఎపుడూ విని ఉండని మాటలు వస్తే,
వాటిని జోపానముగా రాసి పెట్టుకొనేది అలవాటయ్యింది.
ఇట్లా మాటలని మూటకట్టుకొంటా ఉండిన నాతో ,
" ఇంకొక కతల పుస్తకం తేవాలని" రమేశప్ప చెప్పిరి.
ఇట్లా రాస్తా రాస్తా హోసూరు మాండలికమనే విమానమెక్కి,
ఆంధ్రా అసెంబ్లీ లో దూరి,దేశమంతా పారాడి, మంచీ చెడ్డలు చూసి,
భూమమ్మ కూతురికీ పొద్దప్పకొడుకీ పెండ్లి చేసి మబ్బు దేవునికి మొక్కి వస్తిని.
డా. అగరం వసంత్
54 కతలు
వెల : రూ.100/-
చేపలుకి :
డా.అగరం వసంత్ (0)9488330209/ 7795094148
స వెం రమేశ్ : (0) 8500548142
ఉమా మహేశ్వరరావు 8985425888
***
ప్రభవ (0861)2333767/ 2337573
prabhava.books@gmail.com
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment