*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Sunday, November 17, 2013

బుడుగో బుడుగో




చల్ల గాలి వచ్చింది బుడుగో బుడుగో 
పిల్లమబ్బు వేసింది బుడుగో బుడుగో
మెరుపు కన్నెలొచ్చారు బుడుగో బుడుగో
మద్దెళ్ళ చప్పుళ్ళు బుడుగో బుడుగో
బుడుగో బుడుగో బుడుగో బుడుగో

సన్న సన్న చినుకులు బుడుగో బుడుగో
పెద్ద పెద్ద చినుకులు బుడుగో బుడుగో
వానలూ వరదలూ బుడుగో బుడుగో
వరిచేల పంటలు బుడుగో బుడుగో
బుడుగో బుడుగో బుడుగో బుడుగో

వానల్లు కురవాలి వరిచేలు పండాలి బుడుగో బుడుగో
వడ్లన్నీ రావాలి మా కొట్లు నిండాలి బుడుగో బుడుగో
మా నాన్న తియ్యాలి మా అమ్మ వండాలి బుడుగో బుడుగో
    మా బొజ్జ నిండాలి హాయిగా ఉండాలి బుడుగో బుడుగో
బుడుగో బుడుగో బుడుగో బుడుగో


*
Prabhava,Books and Beyond ! * All rights reserved.

1 comment:

జ్యోతిర్మయి said...

భలే భలే...పిల్లల పాట కూడా పెట్టండి వినాలనుంది.