Adthya ,PreP Junior ,Prabhava |
"పల్లవి "
అలుసుగా నన్నైయితే అంటావు గానీ
ఎన్ని చేసినా నాన్నారిని ననవే?
1. నాన్న గారి బల్ల మీద కాగితాలు ఎన్నో ఉంటే
గాలిపడగ కోసం ఒక్క కాగితం తీసుకొంటే
కస్సుమంటూ నా మీద కోప్పడతావు "పల్లవి "
2. నాన్నగారి బుక్కు తీసి చిన్ని పెన్సిల్తోను
అ ఆలు నేను అందంగా రాస్తే
కళ్ళెర్ర జేసి నన్ను కోప్పడతావు
తెల్ల కాగితాల నిండా ఏదో ఏదో రాసేసి
తెగపాడు చేసేస్తోంటే నాన్నారిననవేం? "పల్లవి "
3. గొప్ప గొప్ప గ్రంథాలు నాన్న గారివంటూ
కొత్త కొత్త కవితలెన్నో అల్లేరు అంటూ '
నాన్న గారినెప్పుడూ పొగిడేస్తూ ఉంటావు
కమ్మగా నీ లాగా కథ చెప్ప గలరా?
హాయిగా నీలాగా పాట పాడగలరా?
అమ్మా నాకు చెప్పవే -ఒకసారి
నాన్న గారి రాతలు నీకర్దమవుతాయా? "పల్లవి "
రచన : శ్రీ కవి రావు
Prabhava,Books and Beyond ! * All rights reserved.