నాకు రెండు పిట్టపిల్లలు ఉంటే..
నేను ఆహారం కోసం వెళితే,
నా పిల్లలు నాకోసం ఎదురు చూస్తూ ఉంటే ,
వాళ్ళు ఈ విధంగా అనుకొంటే ,
' మా అమ్మకు ఆహారం దొరక లేదా?
అక్కడ ఎదైనా ఆపద వచ్చిందా?
వేటగాడి వలలో చిక్కుకుందా?
దారి ఏమైనా తప్పిపోయిందా?
ఆహారం కోసం వెతికి వెతికి అలసి పోయిందా?
ఆహారం కోసం వెతుకుతూ, తగిలి ఏమైనా పడి పోయిందా?
స్నేహితులతో మాట్లాడుతూ ఉందా?
మనల్ని మరిచి పోయిందా?"
నా కోసం పిట్టలు అరుస్తుంటే,
నన్ను వెతుకుతూ పిట్టలు ఒక దారి పోతే..
నేను గూటికి మరోదారిన చేరైతే..
పిల్లలు ఒక దారి . నేను మరోదారి!
S.రెడ్డి రాణి, 9వ తరగతి, ZP హై స్కూలు ,తెట్టు
5-9 -11
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment