*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Wednesday, April 16, 2014

రొవంత మందల

Lto R: Sunil Kumar,Dr.Chadnra Shekhar Rao,V.Pratima,
SreeRamana,Chandra Latha,SivaReddy,
Papineni Sivashankar,Vasireddy naveen,
Penukonda Laxmi Narayana,R.M.Uma Maheswara Rao
అబ్బాయా... అమ్మాయా...
ఏందంటా ఈ కథా?
ఓ ..అంటా..
ఆ మాదిరి ఇరగబడి పోతాండారు..
రొవంత మందల జెప్పేసి పోరాదో..?
***
దిల్లీ అబ్ క్యా దూర్ హై .. అన్నట్లు, దర్జాగ డిల్లీలో కూర్చుని ,కథ 2013 ఆవిష్కరణ సభలో మాట్లాడిన కథకులు ,అమరేంద్ర దాసరి గారి సూదూర ప్రసంగం మొదట.

***
నాకు తెలిసిన, నాకు తెలియని సాహితీ మిత్రులందరికీ శుభ ఆకాంక్షలు
ఇద్దరు వ్యక్తులు..24 యేళ్ళు..నిరంతర తపన..నిబద్ధతతో కూదిన కౄషి..
ఒక నిమగ్నతతో..ఒక మంచి ఉద్దేశ్యం తో..చేసిన, చేస్తోన్న నిర్విరామ ప్రయత్నమిది..
24 సంపుటాలూ ఆయా  కథలకే పరిమితమా..?? కానే కాదు..గత 24 యేళ్ళ తెలుగు దేశపు సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర కు నిలువెత్తు అద్దాలు సంపుటాలు..

" ఒకె ధోరణికి చెందిన కథలు", " ఒకె ప్రాంతానికి చెందిన కథలు", ఒకె బృందానికి చెందిన కథలు" - విమర్సలకేం, కోకోల్లలు!! 'కథా మాఫియా' అన్న పుల్ల ద్రాక్ష జంబూకాలకూ కొదవు లేదు..
కథ 2013 నే చూద్దాం..
సిది మొయిలు  నుంచి చంద్రుదు గీసిన బొమ్మలు  వరకూ..
నీలా వాల్ల అమ్మ  నుంచి loss of innocence  వరకూ..
రి బూట్  నుంచి యాళ్యపాళెం  గోస  వరకూ..
గుట్ట  నుంచి వొంద వొంటెలు  వరకూ
సప్త వర్ణ సమ్మిస్రితం  నుంచి  పగడ మల్లెలు వరకూ..
ఎంత వైవిధ్యంఎంత పరిశీలనఎంత జీవితం!
నిజమే..
కథలన్నీ ఒకే ధోరణికి చెందినవి - ధోరణికి జీవితమే పునాది..
ఒకే బృందానికి చెందినవి - బృందానికి సమాజమే కధా వెదిక..
ఒకే మూసకు చెందినవి - మూసకు మానవుని అభ్యున్నతే కేంద్ర బిందువు..
ఒకే ప్రాంతానికి చెందినవి - ప్రాంతానికి మానవ వేదనే సరిహద్దు..
               **                **                **

కథ 2013 ఆవిష్కరణ సందర్భంగా 14 మంది కథకులకూ, ఇద్దరు సారధులకూ, నెల్లూరు ఫ్రభవ కూ నా ఆత్మీయ అభినందనలు..
అమరేంద్ర దాసరి

***

Related Link : http://chandralata.blogspot.in/2014/04/blog-post_14.html


Prabhava,Books and Beyond ! * All rights reserved.

No comments: