నమస్తే.
అంతా కుశలమే కదా?
నన్ను గుర్తు పట్టేసారు కదా?
నేను కస్తూరి బాయి గాంధీ ని.
అందరూ నన్ను ఆప్యాయంగా కస్తూరి బా అని పిలుస్తారు.
నేను సబర్మతి వద్దనే ఉన్నాను. మోహన్ జీ జైలులోనే మరొక సత్యాగ్రహం చేస్తున్నారు. వారు క్షేమంగా సబర్మతికి తిరిగి రావాలని ఎదురుచూస్తున్నాను.
ఇప్పుడే వార్త అందింది. మోహన్ జీ విడుదల అయ్యారు.
అందరం ఎదురు వెళ్ళి మోహన్ జీ ని ఆహ్వానించాం.
వారితో పాటు నాకు స్వాగత సత్కారాలు అందాయి.
అందులోనూ ఈ రోజు బాపూజి పుట్టిన రోజు కదా?
వస్తూ వస్తూ మూడు కోతి పిల్లలను తెచ్చారాయన.
ఎంత ముచ్చటగా ఉన్నాయో!
తెలివి గల్లవి. గాంధిజి వచనాలకు ప్రచారకులుగా మారాయి!
వాటికి అరటి పళ్ళు తెచ్చి పెడతాను. ఆకలి వేసిందంటే సబర్మతి కుటీరాన్ని పీకి పందిరేస్తాయేమో!
అందరికీ భోజనవ్యవహారాలు చూడాలి కదా..నాకిక సెలవా?
సర్వేశాం మంగళం భవతు !
సర్వేశాం శాంతిర్ భవతు !
Related link :
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.
1 comment:
Chakkagaundi
Post a Comment