*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Friday, October 25, 2013

అప్పుడు వచ్చే వర్షం


అడవిలో జంతువులమ్మా జంతువులు.
నీటి కోసం తనకలాడే జంతువులు.
అప్పుడు వచ్చే వర్షం.
జంతువులన్నిటి ఆనందమైన వర్షం.
చేపలు బతికేటందుకు వచ్చే వర్షం.
మా అందరికీ ఆనందమైన వర్షం.


వి. చరణ్ తేజ,   
6 తరగతి , విద్యావనం ,REC రిషీ వ్యాలీ పల్లె బడి.2005
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Tuesday, October 22, 2013

వర్షమై రావమ్మ












చిన్ని చినుకు చిలకమ్మ   
వర్షమై రావమ్మ
చిన్ని పాపలై మము చూడు
మా హృదయాలను తాకి చూడు
మేము కోరుకొన్న వర్షపు చినుకా!
మా వైపు రాఎందుకు ?
సిరి వెన్నెల నీ కొసమే ఉన్నది
నువ్వు చూడవేలా
అలా వచ్చి పోతావు
నీవే నా దేవా..
ఓ వర్షపు చినుకా !
***
లీలావతి   2005
6 తరగతి , విద్యావనం ,REC రిషీ వ్యాలీ పల్లె బడి.




Prabhava,Books and Beyond ! * All rights reserved.

Saturday, October 19, 2013

వర్షాలమ్మా వర్షాలు










ఊరికంతా ఇష్టమైన  వర్షాలు
అవి వస్తే ఆకాశంలో మబ్బులొస్తాయి
ఇవి వస్తే వూరి చెరువులు నిండేస్తాయి
వాగులు సరస్సులు పొర్లేస్తాయి
వర్షాలమ్మా వర్షాలు
ఊరికంతా ఇష్టమైన వర్షాలు

ఇవి వస్తే ఆకాశంలో  నక్షత్రాలు కనబడవు
అవి వస్తే తాగడానికి నీళ్ళొస్తాయి 
వర్షాలమ్మా వర్షాలు
ఊరికంతా ఇష్టమైన వర్షాలు

వీటి వలన చెట్లొస్తాయి.
చెట్టులోకి ఉడుతలొస్తాయి.
ఇంకా కాయలొస్తాయి.
ఆడవారికి తలలో పెట్టుకోను పూలొస్తాయ్!
బీదవారికి మంటకోసం కట్టేలొస్తాయి

వర్షాలమ్మా వర్షాలు
ఊరికంతా ఇష్టమైన వర్షాలు
***
వి. చరణ్ తేజ
6 తరగతి , విద్యావనం ,REC రిషీ వ్యాలీ పల్లె బడి.2005

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Thursday, October 17, 2013

వర్షపు చినుకా!

నీలి మబ్బులు నింగి లోన
ఎదురుచూసే వర్షపు చినుకా!
భూమిపై చేరేందుకు ఆకాంక్షగా ఉందా?
వర్షపు చినుకు భూమిపై చేరింది
తన ఆకాంక్ష తీరింది
భూమిపై తన మనసు హృదయాన్ని విడిచి

స్వచ్ఛమైన భూమికే అంకితమైంది.
***
లీలావతి  6 వ తరగతి. 2005

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Monday, October 14, 2013

అన్నీనీవే !






వానా వానా వానా!   
నీవు అంటే అందరికీ ఇష్టం.
నీ వలన పంటలు నష్టం.
ఊళ్ళు కొట్టుకు పోతున్నాయి.
బావులు నిండితే లాభం.
లాభం నష్టం అన్నీనీవే!
ఓ వానా వానా వానా !
***
విద్యానంద్ ,
6 వ తరగతి ,విద్యావనం , 
రిషీవ్యాలీ  పల్లెబడి. 2005
****

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Friday, October 11, 2013

ఏమేమి పూవప్పునే


Prabhava School
 ఏమేమి పూవప్పునే   గౌరమ్మ
ఏమేమి కాయప్పునే
తంగేడు పూవప్పునే   గౌరమ్మ
తంగేడు కాయప్పునే

తంగేడు పూవుల్లో .... తంగేడు కాయల్లో

ఆట చిలుకలు రెండు, పాట చిలుకలు రెందు
కలికి చిలకలు రెండు, కందువ్వ మేడలో


ఏమేమి పూవప్పునే గౌరమ్మ

ఏమేమి కాయప్పునే
http://www.youtube.com/watch?feature=player_embedded&v=i0EBMggiDOo
వినగ వినగ పదమూ.. 
అనగ అనగ  రాగమూ ..
కనగ కనగ దృశ్యమూ ..
అతిశయిల్లుచునుండు !
***
బతుకమ్మలకు జేజేలు. 
***
సర్వేజనా శాంతిర్ భవతు ! 

Related links :   

“Bommala Koluvu”

"నీకో బొమ్మ నాకో బొమ్మ “

Friday, October 4, 2013

నేను కస్తూరి బాయి గాంధీ ని!

 
నమస్తే. 
అంతా కుశలమే కదా?
నన్ను గుర్తు పట్టేసారు కదా?
నేను కస్తూరి బాయి గాంధీ ని.
అందరూ నన్ను ఆప్యాయంగా కస్తూరి బా అని పిలుస్తారు.

 
నేను సబర్మతి వద్దనే ఉన్నాను. మోహన్ జీ   జైలులోనే మరొక సత్యాగ్రహం చేస్తున్నారు. వారు క్షేమంగా సబర్మతికి తిరిగి రావాలని ఎదురుచూస్తున్నాను.
ఇప్పుడే వార్త అందింది. మోహన్ జీ విడుదల అయ్యారు.

అందరం ఎదురు వెళ్ళి మోహన్ జీ ని ఆహ్వానించాం.
వారితో పాటు నాకు స్వాగత సత్కారాలు అందాయి.
అందులోనూ ఈ రోజు బాపూజి పుట్టిన రోజు  కదా?

వస్తూ వస్తూ మూడు కోతి పిల్లలను తెచ్చారాయన.
ఎంత ముచ్చటగా ఉన్నాయో!
 తెలివి గల్లవి. గాంధిజి వచనాలకు ప్రచారకులుగా మారాయి!

చెడు అనవద్దు. చెడు కనవద్దు.చెడు విన వద్దు .  అంటూ గెంతుతూ పాటలు పాడుతున్నాయి





 

వాటికి అరటి పళ్ళు తెచ్చి పెడతాను. ఆకలి వేసిందంటే సబర్మతి కుటీరాన్ని పీకి పందిరేస్తాయేమో!


 అందరికీ భోజనవ్యవహారాలు చూడాలి కదా..నాకిక సెలవా?
సర్వేశాం మంగళం భవతు !

                                                                 సర్వేశాం శాంతిర్ భవతు !
Related link :
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Tuesday, October 1, 2013

రేయింబవళ్ళు!

మా పిల్లలకూ నాకూ ఎంతగానో నచ్చిన చిట్టిసినిమా.. 
రేయింబవళ్ళు! 
మీ కోసం! 
శుభోదయం!
whttp://www.youtube.com/watch?v=MRuURW_UXfw
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.