నేను ఒక కొబ్బరి చెట్టును.
అది వేసవి కాలం.
ఒక రోజు నా దగ్గరికి ఒక వడ్రంగి పిట్ట వచ్చి , తన ముక్కుతో పొడిచి పెద్ద రంధ్రం పెట్టింది.
నాకు చాలా నొప్పివేసింది.నేను దానిని భరించాను.
అది రంధ్రంలో 4 రోజులు నివసించి ,4 గుడ్లు పెట్టి తన తండ్రితో వేరే చోటుకు వెళ్ళింది.
కారణం ఆ గుడ్లను అది నాలుగు రోజులు పొదిగింది.పిల్లలు గుడ్లనుంచి రాలేదు. అది బాధ పడి వేరే చోటుకు వెళ్ళింది. నేను ఆ గుడ్లను కొన్ని రోజులు రక్షించాను.
ఒక రోజు ఒక నరుడు కొబ్బరికాయల కోసం నా మీదికి ఎక్కాడు. కాలు జారి కింద పడ్డాడు.
మరుసటి రోజు మరొక నరుడు ఎక్కాడు.ఆ గుడ్లను చూస్తాడేమో అని చాలా భయ పడ్డాను.నాకు అప్పుడు నరుడు గుడ్లకోసం ఆశ పడడు.కొబ్బరికాయల మీద ఆశ ఎక్కువ అని ఆలోచన తట్టింది.
నా స్నేహితుడైన చింతచెట్టు కొమ్మలతో గుడ్లు ఉన్న రంధ్రము ను మూసివేశాను. ఆ గుడ్ల మీద ఎవరు చాలా రోజులు దృష్టి ఉంచలేదు.
తరువాత ఆ పక్షి తిరిగి నా వద్దకు వచ్చింది.
వరసగా పదకొండు రోజులు గుడ్లను పొదిగింది. అప్పుడు ఆ గుడ్లనుండి నాలుగు పిల్లలు వచ్చాయి.
పక్షి సంతోషించి, తన చెల్లి అయిన కౌజు పిట్టకు ,అక్క అయిన పావురము ను కూడా ఆ చెట్టులోనే గూడు కట్టుకోమని చెప్పింది.
అప్పటి నుంచి ,నా స్నేహితుడు అయిన చింత చెట్టు పైనా, నా పైనా చాలా గూళ్ళు ఉన్నాయి.
అది చూచి నాకు ఎక్కడ లేని సంతోషం కలిగింది.
***
పి .రాజు, 7 వ తరగతి, రిషీవ్యాలీ పల్లె బడి,6.9.11
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment