*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Saturday, February 4, 2012

సూర్యుడు సున్నా

ఒక వూరిలో 0,1,2,3,4,5,6,7,8,9 అనే స్నేహితులు ఉండే వారు.
వీరికి సూర్యుడు చంద్రుడు మంచి మిత్రులు.

ఆ రోజు సూర్యుని పుట్టిన రోజు.
 సూర్యుడు పార్టీ ఇయ్యాలని అనుకొన్నాడు.
అందుకు తన స్నేహితులైన 0,1,2,3,4,5,6,7,8,9  లను ఇంటికి పిలిచాడు.
అందరు వరసగా టేబుల్  పైన కూర్చున్నారు.

అప్పుడు సూర్యుడు కేకు కోశాడు.
సూర్యుడి వాళ్ళ అమ్మ 1 కి ఒక కేకు ముక్క, 2 కు రెండు కేకు ముక్కలు, 3 కు మూడు కేకులు ..అలా అందరికీ పంచుతూ పోయింది. 0 కు మాత్రం ఏమీ ఇవ్వలేదు.

అప్పుడు 0 చాలా బాధ పడింది.
సూర్యుడు 0 ను చూశాడు.
దానిని పిలుచుకు పోయి 1 పక్కన కూర్చోపెట్టాడు.

అప్పుడు సూర్యుడి వాళ్ళమ్మ 0 కు పది కేకు ముక్కలు ఇచ్చింది.
దాంతో 0 ఎంతో సంతోషించింది.

***
పి.భావన, 6 వ తరగతి ZPHS స్కూలు ,తెట్టు .


Prabhava,Books and Beyond ! * All rights reserved.

No comments: