(బాలోత్సవ్ -2010 కవితారచన లో ప్రథమ బహుమతి పొందిన కవిత )
అయ్యో ప్రకృతి!
చక చకా గాలిలోకి
ఎగిరిన మామిడి చెట్టు
మా ఇంటి మబ్బున ఉంది
వేసవి కాలం ప్రారంభమున ,
ఇంటికి వచ్చే అథిది దేవుళ్ళ మీద
పూల వర్షం కురిపించి
స్వాగతం పలుకుతుంది
ఆ కాలమున కొన్ని కాంతులు
చెట్టు నుంచి విస్తరించాయి
అవే మామిడి పండ్లు ,
మన కాంతులు
ఒహో ఎంత పుల్లగా ఉన్నాయో !
అనిపించినా ,ఒకటి గుర్తుకు రాక తప్పదు
తీపుంది పులుపుంది భేదం వేరే ఉంది
"పులుపన్నది ఉన్నపుడే కదా తీపి!"
అవి కిందికి రాలి
మా ఇంటిని మొత్తం
వెలుగుల మయంగా మార్చేసింది
ఇంత ఇచ్చినా ఎంత ఇచ్చినా దానికి
ధన్యవాదాలు చెప్ప మరిచాను
అందుకే ప్రకృతికి ,
చేతులెత్తి కృతజ్ఞతలు చెప్పాను.
కానీ,
అది నాకు ఎన్ని ఇచ్చినా గానీ,
అదే నాకు కృతజ్ఞతలు చెప్పాలి.
ఎందుకంటే
నేను తిన్న వెలుగులలో
ఉన్న టెంకెను మబ్బుల్లోకి వదిలేసాను కాబట్టి .
ఎందుకంటే ,
కొత్త జీవం మొలుస్తుంది కాబట్టి.
అయ్యో ప్రకృతి!
ఇటు నాతో ధన్యవాదములు చెప్ప లేకా,
అటు నేనూ చెప్పక ,
ఒక చిక్కులో చిక్కుకుంది.
Token no.55 Class 7 ,BaalOtsav, kottagudem -2010
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment