*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Saturday, October 8, 2011

నాకు పుట్టుక లేకుంటే..?!?


నేనే కానీ ఒక కొండై పుడితే..

నా మీద వెలసిన
చెట్లను నరికేస్తుంటే..
బండలు పెరికేస్తుంటే..
ఇక మీదట నాకు పుట్టుక లేకుంటే..
నన్ను నేనే రక్షించుకోవాలి!

నేనే కానీ ఒక కొండై పుడితే ..
భూదేవిని వానదేవున్నీ  నన్ను కాపాడమంటా!
భూదేవిని రాళ్ళను పుట్టించమంటా.
వానదేవున్ని వర్షాలు కురిపించమంటా.

నేనే కానీ ఒక కొండై పుడితే ...
ఎన్నో రకాల దేవుళ్ళను వేడుకొనేస్తా.
నా తరం వారిని ఇంకా పుట్టించమంటా.

మనుష్యుల నుంచి విముక్తి కలిగించమంటా.

*పి. రెడ్డిరాణి ,8వ తరగతి,ZP హై స్కూలు ,తెట్టు




Prabhava,Books and Beyond ! * All rights reserved.

Thursday, October 6, 2011

ఒకటీ ... ఓయమ్మో !


స్త్రీ  అనే ఒక అక్షరం కోసం..
విద్య అనే రెండు అక్షరాలను వదిలేసి..
చదువు అనే మూడు అక్షరాలకు దూరమై..
జీవితం అనే నాలుగు అక్షరాలకు బానిసై..
జీవించడం అవసరమా ..నేస్తమా!
***
 జి.ఇంద్రజ, 8వ తరగతి, ZP హై స్కూల్
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Tuesday, October 4, 2011

ఉపకారికి నెపమెన్నక..!!!

ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు.
అతని పేరు లక్ష్మణ.
లక్ష్మణ వరి పంట వేశాడు.
అతడు రేయనక పగలనక కష్టపడి పంటను కాపాడుకొంటూ వచ్చాడు.

కానీ,
అక్కడ ఆ చేనులో జరుగుతున్న విషయం అతనికి తెలియదు.
ఎలుకలు వచ్చి రాత్రిపూట పంటని తినేసేవి.
అది చూసిన ఒక గుడ్లగూబ ఆ ఎలుకలను తినేసేది.


Screech Owl 1
ఒక రోజు లక్ష్మణ వచ్చి చెట్టులో ఉన్న
 గుడ్ల గూబను చూచి అసహ్యంగా చూశాడు.
ఆ గుడ్లగూబను ఎన్నో చీవాట్లు పెట్టాడు.
ఆ గుడ్లగూబ లక్ష్మణతో ,
" నీ పంటను నాశనం చేయడానికి ఎలుకలు రాత్రిపూట వచ్చి ,
వరిగింజలను తినేస్తున్నాయి" అని చెప్పింది.

కొద్ది రోజుల తరువాత లక్ష్మణ రాత్రి వేళ పంట దగ్గరికి వచ్చి చూశాడు.
ఆ సమయంలో ఎలుకలు గింజలను తినేస్తున్నాయి.
అది చూచిన లక్ష్మణ ఆ గుడ్లగూబ దగ్గరికి వచ్చి చూసాడు. క్షమాపణ అడిగాడు.

ఆ తరువాత గుడ్లగుబ వచ్చి ఆ ఎలుకలను తినేసి, పంటను కాపాడింది.

లక్ష్మణ గుడ్లగుబకు ధన్యవాదాలు చెప్పాడు.
***


బి.తేజ ,9వతరగతి.ZP హై స్కూలు, తెట్టు


***
Prabhava,Books and Beyond ! * All rights reserved.