*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Tuesday, December 23, 2014

మీ పిల్లలకోసం ... కానుక!

కాలాలు మారినా పిల్లలు మారేనా?ఇది పిల్లలకు ముచ్చటగా కానుకలు తీసి ఇచ్చే కాలం కదా! 
మరి, మీరు మీ పిల్లలకోసం ఏమి కానుకలు ఇవ్వ బోతున్నారు ? 
మా పిల్లల కోసం శీతాకాలం పాటలు వెతికి వడపొస్తోంటే , ఈ ఆణిముత్యం దొరికింది.


మొదటిది అసలు సిసలుది.

రెండొది..ఇప్పటిది. 


చూడండి.. 
1. https://www.youtube.com/watch?v=2Dec9Jb_Ac4
2. https://www.youtube.com/watch?v=HH4ZU7LNbUU


Merry Christamas !

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Monday, November 17, 2014

తోలు బొమ్మల ప్రదర్షన -అధ్యయన శిబిరం

తోలు బొమ్మలాట
సినిమాకు అమ్మట !
కేతిగాడు . బంగారక్కలు
                          తెర మీది తొలి హాస్యగాళ్ళుట.                                   
 ఇక, పంచతంత్ర కథలకు పరిచయం దేనికి ?
తోలు బొమ్మలాట , పంచతంత్ర కథల ప్రచారమే ధ్యేయంగా , రిషీ వ్యాలీ పల్లె బడి పిల్లలు మన ముందుకు తెస్తోన్న కార్యక్రమం  .  అంతే కాదు, తేమ , ధూళి లతో వాతావరణ సమస్యలను తట్టుకోవాల్సిన   తోలు బొమ్మలను ,సులభతరం చేసి,  “ షాడో పప్పెట్రీ   “ని బడి పాఠాలకు  వారు అన్వయించుకొన్నారు.
అటు తోలు బొమ్మల ప్రదర్షన ,  ఇటు తరగతి గదిలో వాటి ని పాఠాలకు వాడకం  గురించిన  అధ్య శిబిరం , మన ఊరిలో  ఒకే మారు నిర్వహిస్తున్నాము.
ఆత్మీయ అతిథి   :           శ్రీ విఠపు బాలసుబ్రమణ్యం గారు ,
                                        MLC ,  నెల్లూరు.
సమయం :                    మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు 
తేదీ  :                           20 ,నవంబరు ,2014
 స్థలం  :                       ప్రభవ  బడి, పొగతోట ,నెల్లూరు.
తరగతి గది లో వాడే పప్పెట్రీ కిట్  వెల : 500/-    పప్పెట్లు, క్యాసెట్ల తో బాటు అనేక ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్స్ పరిచయం చేయబడతాయిఆసక్తి గల ఉపాధ్యాయులను, విద్యార్థులను ఆహ్వానిస్తున్నాము


ప్రభవ , నెల్లూరు    0861-2337573,2333767     ఋషీవ్యాలీ గ్రామీణ విద్యాకేంద్రము, ఋషీవ్యాలీ        మదన పల్లె


***




Prabhava,Books and Beyond ! * All rights reserved.

Friday, September 12, 2014

ఈ సంగతి విన్నావ్ ?


పరుగున పరుగునా రారండి..
ప్రభవ పల్లె బడి తెరిచారండి.

అమ్మా నాన్నా,అవ్వాతాతా, అక్కా అన్నా, 
వదినా అత్తా, బాబాయ్ పిన్నావ్..
ఇదిగిదుగో...
                                                             ఈ సంగతి విన్నావ్ ?

భాషలేవో నేర్పుతారంట... 
కళలలో  పాఠాలంట...
ఏమిటేమిటో అన్నారమ్మా...!!!
చక చక మనము వెళదామా...
చూసి నేర్చి వద్దామా.. !

ఆహ్వానం :
ఫ్రభవ పల్లె బడి కేంద్రం, భాషాకళల తరగతులు. 
అల్లూరులో ప్రారంభం. వయోపరిమితి లేదు. 
మొదటి తరగతి : ఈ శనివారం , 13 సెప్టెంబర్,2014 ఉదయం 9 గంటలకు
వివరాలకు సంప్రదించండి: ప్రభవ (0861)2337573/2333767
శ్రీధర్ రెడ్డి గారు, Cell : 9492801032 , 7674920777 Land :08622256544

***
Prabhava, An Institution for Language and Art,
announces it's first Satellite Rural Center at Alluru, Nellore DT.

Classes begin from Saturday, 13 September ,9AM.
Interested children and adults are requested to register on or before Saturday.

Contact "Prabhava School ,Nellore (0861)2337573,
Prabhava Book Store , Nellore (0861) 2333767
Sridhar Reddy Meda,Alluru, Cell : 9492801032 , 7674920777 Land :08622256544


You are Welcome !
  
***
http://chandralata.blogspot.in/
http://chandralata.blogspot.in/2014/09/blog-post_9.html


Prabhava,Books and Beyond ! * All rights reserved.