*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Friday, September 20, 2013

కల ”కలం”

మా తాత గారి తండ్రి వ్యాపారపు పని మీద అమెరికాకు వెళ్ళినప్పుడు, మా తాతగారి కోసం ఒక కలం తెచ్చారట.
మా తాత గారు కలమును బంగారం కంటే విలువైనదిగా చూసుకొనే వారు. అన్ని పరీక్షలు కలంతోనే రాసేవారు. మా తాత గరికి పదవతరగతిలో తొంభై రెండు శాతం  మార్కులు వచ్చాయి
Image 1ఊరిలోని వారందరూ ,మా తాతగారికి కలం వలననే మార్కులు వచ్చాయని  అనడం మొదలు పెట్టారు. బంధువులు ,ఊరివారందరూ తాతగారిని ఎంతో మెచ్చుకొన్నారు. కానీ, అతను చదువులో పెట్టిన ధ్యాస, శ్రమ కాకుండా ,పరీక్ష వ్రాయుటకు వాడిన కలాన్ని మెచ్చుకున్నారు. దానితో మా తాతగారికి కలం మీద కోపం కలిగి ,దానిని ఒక మూల పడవేశారట .
కొంత కాలం గడిచిన తరువాత కూడా కలం గూర్చి ఎవరూ మర్చి పోలేదు. మా తాత ఊరు వదిలి వెళ్ళాక ,అతనిని  గూర్చి మనుష్యులు మర్చిపోయారు .కానీ, కలం గూర్చి ఎవరూ మర్చి పోలేదు.   పెద్దలందరూ చిన్నపిల్లలకు కలం గురించి చెప్పే వారు. తన ఊరి మీద కోపంతో ,మా తాతగారు ఉద్యోగం చేయడానికి వెళ్ళి,ఎప్పుడూ ఊరికి తిరిగి వెళ్ళ లేదు.
చాలా సంత్సరాలు గడిచాక ,ఒకసరి మా నాన్నతో నేను ,మా ముత్తాతను కలవడానికి మా ఊరికి వెళ్ళాను.
మా ముత్తాతకు 90 ఏళ్ళ పై వయసు. అతను సరిగ్గా మాట్లాడడం లేదు. నడవలేరు కూడా.
అక్కడికి వెళ్ళినప్పుడు, ఊరిపెద్దలు నాకు  ఒక కలం గురించి చెప్పారు. అది మా తాత గారిదని ఎవరూ చెప్పలేదు. ఎవరికీ గుర్తులేదు కాబోలు. అన్ని సంత్సరాలు కథ చెప్పడంలో , కథలో ఇతరకథలు కలగాపులగం అయిపోయాయి.   కలము వాడిన వాడు అసలు చదువుకొనే వాడు కాదు కానీ , కలంతో వ్రాయుటం వలన  అతనికి నూటికి నూరు మార్కులు వచ్చాయని నాకు చెప్పారు.
నేను పదవ తరగతిలో ఉన్నాను. ఇంకా రెండు మూడు నెలలలో మా పరీక్షలు మొదలవుతాయి. మా స్నేహితుడు అసలు చదువుకోడు. తనకి కలం ఇస్తే బావుంటుందని అనుకొన్నాను .
  కానీ, అటువంటి కలం ఎక్కడనుండి  తీసుకు రావాలో ఎవరికీ తెలియలేదు.  కొనాలన్నా కలం పేరేమిటో కూడా తెలియదు. ఊరిలో పెద్దలను కలం పేరడిగితే , దాని పేరు తెలియదు కానీ , దీనిలో ఇంకు మళ్ళీ మళ్ళీ నింపవచ్చని చెప్పారు.
నేను పట్టణానికి తిరిగి వచ్చాక , మా స్నేహితుడికి కలం గురించి చెప్పాను
అతను  వెంటనే ఆ కలం కావాలి అనెను
రోజు నుండి మేము ప్రతి దుకాణానికి వెళ్ళి ,ఇంకు మళ్ళీ మళ్ళీ పోయాల్సిన కలం కోసం అడిగాము. అటువంటి కలాలు ఒకటో  రెండో ఉంటాయనుకొన్నాము. కానీ, ప్రతి దుకాణంలో పది కంటే ఎక్కువ ఉన్నాయి. ఇంక లాభం లేదని మేము నమూనకు ఒక కలం కొన్నము
బోర్డు  పరీక్షలకు ముందు జరిగే పరీక్షలలో మా స్నేహితుడు కలాలను వాడి చూశాడు. కానీ ,మా స్నేహితుడు  పరీక్షలోను పాస్ అవ్వలేదు
రోజూ కలం  కోసం వెతకడంలో  " హీరో " క్యాంలిన్" వంటి కలాల పేర్లను నేర్చుకొన్నాము కానీ , చదువు ఏమీ నేర్చుకోలేదు.
నేను ఇలా రోజూ బయటకు వెళ్ళడం చూసి మా నాన్న నన్ను విషయం ఏమిటని అడిగారునేను తనకు  పూర్తి  కథ చెప్పాను. నేను చెప్పినదంతా విని ,నవ్వి, తన జేబులోనుంచి ఒక కలాన్ని బయటకు తీసారు. " కలం ఇదే !"అన్నారు. ఆశ్చర్యంతో నేను కలం తీసుకొని చూస్తే ,దాని మీద "పార్కర్" అని వ్రాసి ఉంది.
ఇంక రెండు రోజుల్లో మా పరీక్షలు. వెంటనే ,నేను మా స్నేహితుడి ఇంటికి పరిగెట్టాను.
తనతో కలిసి దుకాణమునకు వెళ్ళి, దుకాణ దారు ముందు మా దగ్గర ఉన్న యాభై రూపాయలను  పెట్టాము. ఒక పార్కర్ పెన్ను ఇవ్వమని అడిగాము.
అతను నవ్వి, "కేజీ టమటాలే వంద రూపాలు. యాభై రూపాయల్కౌ పార్కర్ పెన్ను  ఎక్కడ దొరుకుతుంది ?" అని అడిగాడు.
అప్పుడు మా ఇద్దరికీ మా తప్పు తెలిసింది. మేము ఎప్పుడూ వంద రూపాయల కంటే  ఎక్కువ కలం ఉంటుందని అనుకోలేదు. వంద రూపాయలకంటే తక్కువ కావాలని అడిగాం కాబట్టి ఖరీదైన కలాన్ని దుకాణ దారు  మాకు చూపెట్టలేదు. ఎంత అడిగినా అతను మాకు పెన్ను ఇవ్వ లేదు.
అందుకనే ,నేను ఇంటికి వెళ్ళి ,మా నాన్న ను బ్రతిమిలాడాను. కలాన్ని మా స్నేహితునికి పరీక్షలు వ్రాయడానికి ఇచ్చాను.
పరీక్షలు అయిపోయాయి. ఫలితాలు వచ్చాయి.                                       
అప్పుడు తెలిసింది
నేను  మా స్నేహితుడు పరీక్షలలో బాగ చేయ లేదు. మా స్నేహితుడు పాస్ కూడా కాలేదు
ఆ  కలం వెతుకులాటలో చిక్కుకు పోయి , చదవడం పూర్తిగా మానివెశాం. మాకు సరియైన శిక్ష. కలం గురించిన కథ అంతా ఒక మూడ నమ్మకం అని తెలుకొన్నాము. అప్పటినుండి మేము మూఢ నమ్మకాలను నమ్మ కుండా. ఏమి చేసిననూ, శ్రద్ధ, ధ్యేయంలతో చేశాము.
కలం కోసం నేనూ నా స్నేహితుడు చేసిన ప్రయత్నాలన్నీ జ్ఞాపకం వచ్చినపుడల్లానిపిస్తుంది.
"ఒక చిన్న కలం ఎంత కలకలం రేపిందీ ! "అని.
***

ప్రకృతి ,
పదవ తరగతి ,రిషీ వ్యాలీ పాఠశాల ,3-9-2013
Prabhava,Books and Beyond ! * All rights reserved.

No comments: