ఆ కోతి ఒక రోజు కాలు జారి నీటిలో పడింది.
పోతూ ఉండగా ఒక చేప చూసింది.జాలి పడింది.
కోతిని చేప తన వీపు మీద ఎక్కించుకొంది.
కోతి అటు ఇటు చూసింది. కోతి చేపను చూసింది.
"ఏం చెప్పాలి నేను ? అసలే ఆంజనేయ స్వామిని. ఒక తొక్కు తొక్కితే మునిగి పోతావు " అంది కోతి.
చేప కోతిని " నీకు ఈత వచ్చా?" అని అడిగింది.
"ఓ ! నాకు ఈత వచ్చు "అన్నది.
చేప నీటిలో మునిగింది.
కోతి మళ్ళీ నీటిలో మునుగుతూ తేలుతూ పోయింది.
అప్పుడు కోతి అబద్దాలు చెప్పకూడదు అని తెలుసుకొంది.
***
మాలతి హరిత వనం.11-7-7బుధవారం,
రిషీవ్యాలీ పల్లె బడి
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment