మందారం కాయలు కాస్తుందా ?
ష్! ఆ ఒక్కటీ అడక్కండి!
ఈ చిట్టి రచనలోకి పదండి.
మందారం కాకపోతే మామిడికాయనుకోండి.
కాసేపు.అంతే కదా!
***
"పూవు"
ఉషోదయ వేళలో
విరిసిందో మందార మొగ్గ,
పిల్లగాలి మోసుకొచ్చింది.
సెలయేటి గలగలలు,
సూర్యకనతికి మెరుస్తున్న అలలు,
గాలికి ఊగుతున్న తారలు.
అందమైన సీతాకొక చిలుక ఒకటి వచ్చె,
మందార పూవు మీద వాలె,
తియ్యటితేనెని తాగింది.
ఎంతో ఆనందమెగిరింది,
మళ్ళీ గూటికి చేరింది.
మందారపూవు బాధతో వాడిపోయె.
అక్కడి నుండి కాయ వచ్చె,
పెరిగి పెరిగి పెద్దదయ్యె,
మానవుడు ఒక్కడు వచ్చె.
కాయను చెటు నుండి పెరికె,
గుటగుటా తిని పోయే,
హాయిగా కడుపు నింపే.
ఇది ఎంతో బాగుంది అని అనుకొనే,
ఇంటికి తీసుకు పోయే,
అక్కడ బాగున్న గింజలు నాటే
అన్నిగింజలు మొలకెత్తాయి
లోకాన్ని మొదటిసారి చూసాయి.
పెంపకంతో పెద్దవయినాయి
అబ్బ ! ఎంత మంచి చెట్లో !
లిఖిత ,7 వ తరగతి,రిషీవ్యాలీ పాఠశాల
Prabhava,Books and Beyond ! * All rights reserved.
1 comment:
avunu kadaa.. mandaaram kaakapothe maamidikaaya ,anthe kadaa yentha baagundo kavitha .
Post a Comment