Sunday, September 5, 2010
నేనే గెలుస్తా !
"పుట్టినప్పుడు ఆకుపచ్చ ,
పెరిగాక ఎరుపు,
లోపల అంతా పసుపు.
నేను ఎవరు?"
నేను మిరపకాయని.
నన్ను తింటే నోరు అంతా మండిపోతాది.
అందుకే నను ఫ్యాక్టరీ లకు తీసికెళ్ళి ,చితకబాదేసి ,పొడి చేస్తారు.
ఈ పొడిని కారం అంటారు.
నాకు చాలా నొప్పి వేస్తుంది.
కానీ ,ఈ జన్మలో నేను ఏమి చేయ గలను? అందుకే ఎవరైతే నన్ను పొడి చేస్తారో ,
వాళ్లు తరువాతి జన్మలో మిరపకాయలా పుట్టాలని శపించాను.
కారం ఎక్కువగా తినే వాళ్ళకి కోపం ఎక్కువ అంటారు.
మరి నేనే కారం కారం .కాబట్టి నాకెంత కోపం ఉంటాదో ఆలోచించండి. నా కోపం అందరు భయ పడతారు.కాబట్టి ఈ సారి కూరగాయల ఎలెక్షన్లలో నేనే గెలుస్తాను.
దీనికి కారణం వేరే. కూరగాయలకు నా మీద ఉన్న భయమే కాదు. ఏ వంట రకం కారం లేకుండా ఉంటుందా? పచ్చడుల నుండి ఊరమిరపకాయల వరకు నేనే కావాలి.
కారం లేక పోతే రుచి లేదు.
ఆఖరికి జాంకాయ,మామిడి కాయ ముక్కలు కోసి తినాలన్నా కారం అద్దుకుంటారు.
పేద వారు ,డబ్బు కలవారు అందరికి కారం దొరుకుతుంది. ఇవే కాకుండ ఎన్నో కారణాలు ఉన్నాయి.
అందుకే, నేనే గెలుస్తాను.
చూస్తూ ఉండండి!
*
రచన ,బొమ్మ: దశాని, 8 వ తరగతి, రిషీ వ్యాలీ స్కూల్ ,రిషీవ్యాలి.29-8-2010
Prabhava,Books and Beyond ! * All rights reserved.
Thursday, September 2, 2010
నందనుడు - చిలుక
బాలోత్సవ్ -2009 ,కథారచన లో
జూనియర్ లలో ద్వితీయ బహుమతి పొందిన
సందీప్ కథ.
నందనుడు - చిలుక
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.
జూనియర్ లలో ద్వితీయ బహుమతి పొందిన
సందీప్ కథ.
చిత్రం: హల ,(7 ఏళ్ళు), గ్రీష్మ ప్రభవ, నెల్లూరు.9-5-2010
నందనుడు - చిలుక
నందన వనంలో నందనుడు అనే ఒక పుణ్యపురుషుడుండేవాడు. అతనికి ఒక రోజు తన జీవితంలో ఊహించని తరుణం ఎదురయ్యింది.నందనుడి మంచితనాన్ని ,నిజాయితీని మెచ్చి ఆకాశవాణి ప్రత్యక్షమై ,"నీకేం కావాలో కోరుకో " అంది.
అపుడు ఆ నందనుడు ఆకాశంలో విహరించే పక్షిని చూసి ,
"ఆ పక్షిలా నాకు రెక్కలు రావాలి ,నేను
ఆకాశం లో అలా తేలి పోతూ ఉండాలని" కోరాడు.
"ఆ పక్షిలా నాకు రెక్కలు రావాలి ,నేను
ఆకాశం లో అలా తేలి పోతూ ఉండాలని" కోరాడు.
అపుడు ఆ ఆకాశవాణి , " నీవు రెక్కలు కావాలనీ ,పక్షిలా ఎగరాలనే ఎందుకు కోరుకున్నావు? ధన రాశులు వజ్రవైడూర్యాలు వంటివి కోరుకొంటావు అనుకొన్నాను ఇంతకీ నువ్వు ఇలా కొరుకోవడానికి కారణం ఏమిటి?"అని అడిగింది.
అపుడు నందనుడు ," ధనరాశులతో వజ్రవైడూర్యాలతో భవంతులు కట్టుకోవచ్చు .
ధనవంతులవ్వచ్చు .ఆకాశంలోను విహరించవచ్చు.కాని అది విమానాల ద్వారా.ఈ విధంగా మనిషి జీవితంలో ఎన్ని ప్రదేశాలు తిరిగినా ,ఆకాశంలో స్వేచ్చగా విహరించే పక్షులు పొందిన ఆనందాన్ని పొందలేము. నాకు పక్షులన్నా ,అవి నింగి మర్ధనంలో కేరింతలు కొడుతూ విహరించడమన్నా చాలా ఇష్టం. అందుకే నేను ఈ కోరికను కోరుకున్నాను" అని జవాబిచ్చాడు.
అతని సమాధానానికి పరవశురాలై ,ఆకాశవాణి అతను అడిగిన వరం ఇచ్చి మాయమై పోయింది.
ఆ వరాన్ని పొందిన నందనుడు ఆనందంలో మునిగిపోయి ,తనకు వచ్చిన రెక్కలను ఒక్కసారిగా ఆడించాడు.మరో సారి ఆడించి ,ఆకాశం వైపు చూశాడు.
కానీ, అతను నిల్చున్న చోటనే ఉండిపోయాడు.
అతనికి ఏమీ అర్ధం కాలేదు.
రెక్కలు ఉన్నాయి కానీ ఎగరలేక పోతున్నాడు .అని అర్హ్దమై ,విచారించక ప్రయత్నించాడు. ప్రయత్నిస్తూనే ఉండగా, ఒక రోజు పైకి ఎగిరాడు.రెక్కలు ఆడించే కొద్దీ ఎగురుతూనే ఉన్నాడు.
అపుడు అతని ఆనందానికి అవధులు లేవు.
ఆ క్షణంలో ఆకాశవాణి ప్రత్యక్షమై,
" నీవు సాధించావు. నీవు రెక్కలు కోరుకొన్నావు,కల్పించాను. కానీ, ఎగరలేక పోవడంతో ,నిరాశ చెందక ప్రయత్నించావు. అందుకనే , నీ కోరికను నీవే సాధించావు" అని చెప్పి చివరలో ఇలా అంది.
"ఇలా మనుషుల్లో ఎగిరే శక్తి మనుషులలో ఎవరికీ లేదు.ఒక్క నీకు తప్ప. నీవు ఈ అద్బుతశక్తిని దుర్వినియోగం చేయకు." అని అదృశ్యమైంది.
అప్పుడు నందనుడు సంతోషంతో ఆకాశం లో కేరింతలు కొడుతున్నాడు.
ప్రపంచంలో అందమైన ప్రదేశాలు ,వింతలువిడ్డూరాలు అన్నీ చూశాడు.ఆనందించాడు. మనుషులెవరికీ లేని ఈ శక్తిని వినియోగించుకొని ప్రపంచం మొత్తం చుట్టేసి వచ్చాడు.
ఈ తరుణం లో అతనికి ఒక ఆలోచన వచ్చింది.
"ఈ అద్బుత శక్తితో ఇతరులకు సాయం చేద్దాము" అని.
దీన్నే ఆచరణలో పెడుతూ ఉన్నాడు. చాలా రోజులకు ఒక వేటగాడి దెబ్బ తిన్న చిలుక కనబడింది.
ఆ చిలుక వద్దకు వెళ్ళి కాపాడడానికి ప్రయత్నించాడు.
అప్పుడు ఆకాశ దేవత కనిపించి గంగాజలంలో ముంచితే ఆ చిలుక ప్రాణాలు నిలుస్తాయని చెప్పగా , నందనుడు ఆ చిలుకతో గంగానదికి బయలుదేరాడు.
దారిలో చిలుక అంది,"మీ మనుష్యులలో ఆ వేటగాడి వంటి చెడ్డవాళ్ళు నీ వంటి మంచి ఉంటారని తెలిసింది"
నందనుడు చిలుకను గంగాజలంలో ముంచాడు . చిలుక ప్రాణం నిలిచింది.
ఆ రోజు నుండి నందనుడు చిలుక మంచి స్నేహితులయ్యారు.
అలా వారి జీవితం ఆనందంగా గడిచింది.
***
నీతి:
1. నీ ఆశయ సాధనలో వేయిసార్లు విఫలమైనా ప్రయత్నించు.
2. నీ వద్ద ఉన్న శక్తితో నీవు మాత్రమే సంతోషపడకు నీ తోటి వారికి సహాయం చేసినపుడే , నీ జీవితానికి సార్ధకత
వస్తుంది.
***
కె.సందీప్ రెడ్డి , 7 వ తరగతి, ప్రగతి స్కూల్,సారపాక ,14-11-2009
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.
Wednesday, September 1, 2010
అదుగో అదుగో
అదుగో అదుగో చూడండి.
పచ్చని చెట్టు చూడండి.
పచ్చని కాయలు చూడండి.
మాగినాకా చూడండి.
చెట్టు ఎక్కి పీకండి.
కడుపు నిండా తినండి!
*
డి.వెంకటేశ్, 7వ తరగతి,విద్యావనం, రిషీవ్యాలీ పల్లె బడి.
Prabhava,Books and Beyond ! * All rights reserved.
పచ్చని చెట్టు చూడండి.
పచ్చని కాయలు చూడండి.
మాగినాకా చూడండి.
చెట్టు ఎక్కి పీకండి.
కడుపు నిండా తినండి!
*
డి.వెంకటేశ్, 7వ తరగతి,విద్యావనం, రిషీవ్యాలీ పల్లె బడి.
Prabhava,Books and Beyond ! * All rights reserved.
Subscribe to:
Posts (Atom)


