ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది.ఆ అవ్వ పేరు కాంతమ్మ.
ఆ అవ్వకు ఒక మనవరాలు ఉండేది. ఆమె పేరు వాణి. ఆ పాప రోజు బడికి పోతుండేది.
అవ్వ రోజు అడవికి పోయి ఏడు గంపల విప్పపూలు ఏరుకొని వచ్చేది.
వాణికి సంక్రాంతి సెలవలు ఇచ్చారు.సెలవల్లో అవ్వ ఏడు గంపల విప్పపువ్వు ఎండలో ఆరబోసి ,వాణిని కాపలా పెట్టింది.
అవ్వ మళ్లీ అడవికి పోయింది. వాణి సాయంత్రం అయ్యాక ఏడుగంపల విప్పపువ్వును గంపకెత్తింది.
అంతా ఒక గంపకే సరిపోయింది.
అవ్వ తిరిగి ఇంటికి వచ్చింది.
వాణిని అడిగింది," ఏడు గంపల విప్పపువ్వు ఏది?"
వాణి "ఒక గంపకే ఎత్తాను" అని చెప్పింది.
అప్పుడు అవ్వ,"ఎవరికి ఇచ్చావే, ఈ రొజుకు వదిలేస్తున్నా! రేపటి నుంచి బాగా కాపాలా ఉండు. లేకుంటే నిన్ను ఇంట్లో నుంచి తరిమేస్తా" అని చెప్పింది.
వాణి పాపం తెల్ల వారి నుండి సాయంత్రం వరకు అక్కదే కూర్చుని కాపలా కాస్తుంది. కానీ, అది ఒకే గంపకు అయ్యింది. సాయంత్రం అయ్యాక అవ్వ వచ్చింది.
ఆ గంపనే చూసి ఆ పాపను తరిమేసింది. అవ్వ ఒక రోజు కాపలా కాసింది.
అంతా ఒక బుట్టకు అయ్యింది. అవ్వ తన తప్పు తెలుసుకొని బాధ పడింది.
***
యస్.నాగేశ్వరి, 7 వ తరగతి, 9.1.2007
రిషీవ్యాలీ గ్రామీణ విద్యా కేంద్రం (REC, Rishi Valley)
*
Prabhava,Books and Beyond !
*
All rights reserved.