Saturday, January 26, 2013
Saturday, January 12, 2013
పంట పండింది ! పండుగ చేద్దాం రండి!
రేగు పళ్ళు కుప్పలు జేసి..
చెరుకు ముక్కలు చక్కగ పేర్చి..
ముచ్చట ముగ్గుల్లో రంగులు నింపి..
ముద్దబంతులు మాలలు చుట్టి..
మామిడాకులు తోరణాలు కట్టి...
చిట్టి గొబ్బెమ్మను వాకిట పెట్టి..
గుమ్మాడమ్మను నట్టింట నిలిపి..
చెరుకు గడలు పంచన వాల్చి..
కొత్తబియ్యం.. పాలు బెల్లం ...పరమాన్నం
చిన్ని నా బొజ్జకు జేర్చి....
అన్నం పెట్టిన రైతన్నలకు...
కొట్టై ..
జే..! జే!
సంక్రాంతి శుభాకాంక్షలు !
ప్రభవ బడి పిల్లలు
Subscribe to:
Posts (Atom)