*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Wednesday, December 28, 2011

ఎలాగో అలాగ

అదొక అడవి.
చాలా అందంగా కన్నుల పండుగలాగా ఉంటుంది.
 మరి చిట్టి చిట్టి పొదలు చిన్న చిన్న మొక్కల ముళ్లకంపలు.పచ్చపచ్చని చెట్లు లేత రంగురంగుల పూలు రకరకాల తీగలు.ఆకాశం కనిపించనీయని ఎంతో దట్టమైన వృక్షాలు.
ఆ వనంలో గల గల పారే చక్కని పాటలా నిరంతరం సవ్వడి చేస్తూనే ఉంటుంది. ఏది గట్టున రెల్లుపూలు,ఇసుకలో గుడ్డి గవ్వలు, పలక రాళ్ళు,నత్త గుల్లలు ,గులక రాళ్ళు చాలానే ఉన్నాయి.
ఏటికి దగ్గరగా ఓ పెద్ద మామిడి చెట్టు ..బోల్డన్ని కొమ్మలు రెమ్మలతో ఠీవీగా ఉంది. దానికి ఎంచక్కని మామిడి పళ్ళు.గుత్తులు గుత్తులుగా విరగ కాసాయి.
దగ్గరలోని ఊళ్ళలో ఉండే పిల్లాజెల్లా చిన్నాపెద్దా అక్కడే  ఎక్కువగా  కని పిస్తారు.
 ఎండాకాలం స్కూళ్ళకు సెలవలు. పిల్లల సంబరం పట్టతరం కాదు. తీపైనా వగరైనా మామిడి పిందెల్ని కాయల్ని తెంపుకొని రుచి చూడాల్సిందే .
ఇలా అందరినీ ఆకట్టుకుంటున్న మామిడి చెట్టుకు అలా అలా గర్వం పెరిగి పోయింది.
తనను తప్ప అన్నిటినీ అందరినీ పనికి మాలినవిగా చూడడం మొదలు పెట్టింది.
ఎంతగా అందరూ తననే ఇష్టపడుతున్నా మిగిలిన చెట్టూ చేమా పనికి మాలినవి కాదు కదా?
కానీ ,మామిడి చెట్టుకు అది తెలియడం లేదు.ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికీ ప్రతి వస్తువుగా ఉపయోగం ఉండే ఉంటుంది కదా ,కానీ గర్వంతో ఉన్న మామిడి ఆ విషయం గ్రహించక ప్రవర్తించడం మొదలు పెట్టింది.
చూస్తుండగానే ,ఇలా కొంతకాలం జరిగింది.
మామిడి చెట్టు దగ్గరలోనే ఒక చిన్న గడ్డి మొక్క పుట్టింది. బుల్లి బుల్లి ఆకులతో బుజ్జి కాండంతో అది నేలపై నిలబడి చుట్టూ తేరిపార చూసింది. దానిని చూసిన మామిడి చెట్టు పెద్దగా నవ్వింది. గేలి చేసింది.
కొన్ని రోజులకు గడ్డి మొక్క కొంచం పెరిగింది.
చల్లని పిల్ల గాలికి ఆనందంగా హాయిగా ఊగుతూ వయ్యారంగా పాడుతోంది గడ్డి మొక్క.అదిచూసిన మన మామిడి చెట్టు గర్వంగా తల ఎగరేసి,
 " ఏమే గడ్డి మొక్క నువ్వు ఉయ్యాల ఊగుతున్న ఈ గాలి ఎక్కడిదో తెలుసా?" అంది.
అంతటితో ఊరుకోకుండా ," నా పెద్ద కొమ్మల్ని ఊపడం వల్ల ఈ గాలి పుట్టుంది తెలుసా ? చాసావా నా గొప్పతనం నా ముందు నువ్వు ఎంతో చిన్న దానివి పనికి రాని దానివి అని కూడా " అని అంది.
మామిడి చెట్టు మాటలు విని గడ్డి మొక్క,"నిజమే నీవు చాలా గొప్పదానివి .అంతమాత్రాన నేను పనికిరాని దానిని కాదు " అంది.
మామిడిచెట్టు ," నా కొమ్మలు ఎంతోపెద్దవి. నా కాయలు అందరూ ఇష్టంగా తింటారు. నేణు పండ్లల్లో రాజుని.తెలుసా?" అని అనగానే ,గడ్డి మొక్క " నీవు అలా అండం తప్పు . ఎవరిగొప్ప వారిదే . నేను  చిన్న దానినే  కా నీ నేల తేమను ఆపుతాను.రకరకాల కీటకాలు పురుగులు నా మీదే ఉంటాయి. ఎండలో వచ్చే వారికి నీవు నీడను ఇస్తే ,నేను వారి కాలకు వేడి తగల కుండా కాపాడుతాను" అంది.
అయితే ,మామిడి చెట్టు దాని మాటలు కొట్టి పారేసింది.
ఆ రోజు రాత్రి కురిసిన వానకు నీరు కాల్వలుగా పారింది. నీటి ప్రవాహం ఎక్కువై గడ్డి మొక్క నేలపై వాలి పోయింది.దానిపై కొంత ఇసుక కూడా మేట వేసింది. అది చూసి మామిడి చెట్టు ," చూశావా నీ పొగరు అణిగిందా ? ఈ వానకే నేపై పడిపోయావు .నేను చూడు ఈ వర్షంలో ఆనందంగా స్నానం చేసాను" అంది.
గడ్డి మొక్క తిరిగి నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉండడం వలన ,దాని మాటలు బాధ కలిగించాయి. బదులు చెప్ప లేదు.
ఎలాగో అలాగ రెండో రోజుకు గడ్డి మొక్క నిలబడగలిగింది.
ఆ రోజు రాత్రి కురిసిన వానకు నీరు కాల్వలుగా పారింది. నీటి ప్రవాహం ఎక్కువై గడ్డి మొక్క నేలపై వాలి పోయింది.దానిపై కొంత ఇసుక కూడా మేట వేసింది. అది చూసి మామిడి చెట్టు ," చూశావా నీ పొగరు అణిగిందా ? ఈ వానకే నేపై పడిపోయావు .నేను చూడు ఈ వర్షంలో ఆనందంగా స్నానం చేసాను" అంది.
గడ్డి మొక్క తిరిగి నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉండడం వలన ,దాని మాటలు బాధ కలిగించాయి. బదులు చెప్ప లేదు. 
ఎలాగో అలాగ రెండో రోజుకు గడ్డి మొక్క నిలబడగలిగింది.
కొద్దిరోజులలోనే తుఫాను వచ్చే కలం వచ్చింది. వానలు ఎప్పుడంటే అప్పుడు పడుతున్నాయి. గడ్డి మొక్క పడుతూ లేస్తూనే ఉంది. మళ్ళీ మళ్ళీ.ఓ రోజు ఉన్నట్టుండి వీచిన హోరు గాలికి అంత గాలికి అంత పెద్ద మామిడి చెట్టు ఫెళ ఫెళమంటూ విరిగి పడిపోయింది. దాని మొదలు నరికి నట్లుగా రెండు ముక్కలైంది. విరిగి పడీ పోతున్న మామిడి చెట్టును చూసి గడ్డి మొక్క చాలా విచారించింది. 
"ఓ నా మిత్రమా ,నేను క్రింద పడినా తిరిగి మళ్లీ మళ్ళీ లేవగలను .కానీ ఒకసారి కూలిపోయిన నీవు తిరిగి ఇక నిలబడడం జరగడం కదా " అని విచారిస్తూ ...
నిశ్చలంగా నిటారుగా నిల్చింది చిన్న గడ్డిమొక్క .
***
బి.కల్పన ,10 వ తరగతి.జిల్లా పరిషత్ పాఠశాల ,తెట్టు.

Prabhava,Books and Beyond ! * All rights reserved.