*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Tuesday, December 28, 2010

లేత కలం... లోతైన భావనలు.

మైత్రేయ చిన్నప్పుడు చిన్న చిన్న తెలుగు రచనలు చేశాడు.
 తెలుగు వర్క్ షాపుల్లో  చాలా చురుకుగా ఉండేవాడు.
నవ్వుముఖంతో. రాయలంటే మాత్రం ఎందరిలాగానో కాస్త వాయిదా వేసేవాడేమో కానీ,
వాదనల్లో మాత్రం చురుకుగా ముందుండే వాడు. వారి తరగతి అంతా అంతే కదా మరి.
ఇప్పుడు పదకొండో తరగతిలోకి వచ్చేసి, తనకంటూ కొంత ప్రత్యేకమైన రచనావేదికను ఏర్పాటు చేసుకొన్నాడు.
 ఆ ఆలోచనలేమిటొ అనుభూతులేమిటొ మీరూ స్వయంగా చూడండి.
ఆపై ,ఆరో తరగతిలో మైత్రేయరాసిన చిన్ని రచనను చదవండి.
ఇప్పటిదాకా మైత్రేయ పూర్తిపేరు ,
మైత్రేయరంగ అని నాకు తెలియనే తెలియదు..:-)

చిన్న వయసు .పెద్ద ఆలోచనలు.
లేత కలం. లోతైన భావనలు.
మీరూ చూడండి
Conscience of Cognitation లో.

http://letusblogmaithreya.blogspot.com

మైత్రేయకు అనేక శుభాకాంక్షలు.

అభిమానంగా.
***

జాతర 
*
ఒక ఊరు. ఆ ఊరి పేరు రామాపురం. ఆ ఊరిలో రంగయ్య అనే రైతు ఉండే వాడు.
అతను ఒక రోజు పొలం వెళ్ళి వచ్చాడు. స్నానం చేసి భోజనం చేసాడు.
ఆ రోజు ఆ ఊరిలో పెద్ద జాతర. ఆ జాతరకు రంగయ్య తన కుటుంబంతో వెళ్ళాడు.
జాతర లో దేవుని గుడిని రంగురంగుల దీపాలతో అలంకరించారు.
 రకరకాల వస్తువుల దుకాణాలు ,అలంకరించిన ఎడ్లబండ్లు ,రంగుల రాట్నాలు,
 అనేకరకాల బొమ్మలు ,కుండలు కడవలౌ ,బానలు మూకుడులు ఉన్నాయి.
అక్కడ రచ్చబండ ఉంది.
దానిపై జ్యోతిష్యుడు కూర్చుని జోస్యం చెపుతున్నాడు.
రంగయ్య అక్కడి గుంపులో చేరి వింటున్నాడు.
అప్పుడు ఒక దొంగ వాళ్ళ డబ్బు కొట్టేసాడు.
తరువాత వాళ్ళు పోలీసులను పిలిచారు.పోలీసులు వెంటనే జీపులో వచ్చారు.
దొంగను పట్టుకొని, డబ్బును రగయ్య చేతికి ఇచ్చారు.
ఆ డబ్బుతో అందరు వాళ్ళకు కావలసిన వస్తువులు కొనుక్కొని,
తిరిగి ఇంటికి వెళ్ళారు.
***
మైత్రేయ ఆరో తరగతి.
రిషీవ్యాలీ స్కూలు,
(పిల్లనగ్రోవి  - పిల్లల కలాలు సంకలనం  నుంచి)


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Sunday, December 19, 2010

అంతు పట్టని ఏ సానుభూతి

బాలోత్సవ్ @ కొత్తగూడెం కథారచన లో సీనియర్ లలో ద్వితీయ బహుమతి పొందిన జి.శ్రీరాం , 9 వ తరగతి ,భద్రాచలం పబ్లిక్ స్కూల్ ,సారపాక ,ఖమ్మం జిల్లా ,రచన ఇప్పుడు చదవండి.
***

అంతు పట్టని ఏ సానుభూతి 
నా పేరు మోగ్లి .నేను బెంగాల్ పులుల జాతికి చెందిన ఒక పులిని .
 పులులజాతికి చెందిన మేను స్వతంత్ర జీవులం . మా మంద నాయకుడికి తప్ప మేమెవరి మాట విని ఎరగం .మా కంటూ పాటించ వలసిన నియమ నిబంధనలు మా పెద్దలు ఎప్పటినుంచో చాలా ఆలోచనలతో స్థాపించారు. ఈ నియమ నిబంధనలను మేము తూ చా తప్పకుండా పాటించేవాళ్ళం.
కానీ అప్పుడప్పుడే ఒక శక్తి ఉన్నతశిఖరాలకు చేరుకుంటున్నది.  అదే మానవ శక్తి . ఆ  మానవులంతా మేము ఉంటున్న ప్రదేశాన్ని జంబూద్వీపం అని పిలిచేవారు.
అప్పటిదాకా కాల హయైగా ,సుఖశాంతులతో గడిచింది. ఈ అడవి మాది ,ఈ నేల మాది. ఇది మా ప్రదేశం అని జీవిస్తున్న సంధర్భంలో ఈ మానవులు మా మీద దాడులు జరిపారు.
 కనిపించిన ప్రతి చెట్టు  ప్రతి పుట్ట  గొడ్డళ్ళతో నరికారు.
అడవిలో జంతువుల్ని ఎడాపెడా వేటాడారు.అడవి నియమాల ప్రకారం ఎవరినీ అకారణంగా వేటాడకూడదు.  ముఖ్యంగా మా నియమాల ప్రకారం మనుష్యుల్ని వేటాడకూడదు. మా దృష్టిలో మనుషులు జంతువులందిరిలో బలహీనమైన వాడు. మనుషుల్ని వేటాడంలో మజా ఉండదు. అంతే కాక నరమాంస భక్షణ వలన జంతువుల కోరల పటుత్వం తగ్గి పోతుంది.  కానీ ,ఈ మధ్య మనుషులు ఏనుగులమీదకెక్కి గోధుమ చర్మం వారిని వెనకేసుకొచ్చి ,జంతువుల చర్మాలు కోస్తున్నారు.
ఇలాంటప్పుడు మనుషుల మీద దాడి చేయచ్చును. మనుషుల దుష్ప్రవర్తన చూసి మేము సహించలేకపోయాము. మనుషుల్ని వేటాడడానికి ముందుకొచ్చాం.మనుషులమీదికి దూకి మరీ వారిని కసితీరా చంపాం. దాంతో ఆ మనుషులంతా కుయ్యో మొర్రో అంటూ అడవి నుంచి పారిపోయారు. అక్కడితో అయిపోయిందనుకొని హాయిగా బతక సాగాం.
కానీ, మనుషుల పగ మాత్రం చల్లార లేదు. చాలా ఏళ్ళవరకు మా మీద ఏదాడీ జరగలేదు.కానీ మనుషులు మాత్రం తమ బుద్ధిబలంతో చాలా ఆయుధాలను రసాయనాలను సృష్టించారు.  భూమిలోని ఖనిజాలను దోచుకొని చాలా నిర్మించారు.
అప్పటికే మా జంబూ ద్వీపాన్ని కొంతమంది తెల్ల వాళ్ళు వలసచేసుకొన్నారు.
వాళ్ళు నిర్మించిన ఆయుధాలతో మా మీద మళ్ళీ దండయాత్ర కొనసాగించారు.

ఈ సారి మా వీరత్వం వాళ్ల ముందు ఏమాత్రం  సరిపోలేదు. కనిపించిన ప్రతి పులినీ కసితీరా చంపారు. ఒక నాయకుడిగా నేను కూడా వాళ్ళను ఎదుర్కొన్నాను. కానీ, నా శక్తి సామర్థ్యాలు వాళ్ళముందు సరిపోలేదు. ఒక పక్కన నా బంధువులు ,నా స్నేహితులు అందరు మనుషుల చేతిలో అధోగతి పాలవుతున్నారు. ఎలాగైనా సరే మేము జీవించాలి. నేను మా మందలో మిగిలిన వారితో కలిసి పారిపోయాను.
నేను మిగతావాళ్ళతో కలిసి పారిపోయునప్పుడు ,నా పై నాయకుడ్ని వాళ్ళు బంధించారు.
తెల్లదొర ఒకడు తుపాకీ తో మా నాయకుడ్ని చంపి ,దాని మొహం మీద కాలు పెట్టి వీరోచితంగా నించున్నాడు.

ఇది చూసి మాలో కసి బాగా పెరిగింది.కానీ ,అక్కడి నుంచి పారిపోయాము.
ఇప్పటివరకు నేను నాతో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకున్నాను.
కానీ, మనుషులందరూ చెడ్డవాళ్ళన్న భ్రమలోనే ఉన్నాను.
తరువాత తెలిసింది. మనుషుల్లో కొంతమంది మంచివాళ్ళున్నారని.కొంతమంది జంతుప్రేమికులున్నారనీ . వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా వాళ్ళు తయారు చేసిన అడవుల్లో ఉంచారు.
కానీ, కొంతమంది ఇప్పటికీ వేటాడం మానలేదు. అయినా సరే , ఎవరికీ లొంగకుండా అక్కడే నేను నా మందను కాపాడుకొంటున్నాను.

***

Photo courtesy:
http://www.thewareaglereader.com/2010/09/something-resembling-plainslinks-tiger-cub-edition/
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Saturday, December 11, 2010

అప్పుడు అక్కడ

***
గీతాంజలి ,8వ తరగతి,రిషీవ్యాలీ పాఠశాల ,
***
అప్పుడు అక్కడ,
ఎన్ని చెట్లు ఎంత నిశ్శబ్దం
ఎంత ప్రమాదం ,ఎవరికీ తెలియనిది.

చీకటిలోని కళ్ళు ఎప్పుడూ నిన్నే చూసేవి.
మండ్రగబ్బలు నీ నుంచి పరిగెత్తేవి.

ఈ అడవిలో ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా వెళ్ళచ్చు.
ముళ్ళు నీ పాదాలలో గీరుకొని ఉంటాయి.

చెట్లు వేర్లు నుంచి పడి ,అక్కడే ఉంటావు.
దాహం వేస్తుంది. కడుపు రగులుతుంది.

ఎక్కడకు వెళ్ళినా నీకుదాహమూఆకలీ తీరదుగా?
అయితే ఇక్కడే ఆగి చనిపోవచ్చు కదా.

అప్పుడే ఒక పులి నీ దగ్గరకు వస్తుంది.
నువ్వేమీ చేయలేవు. నీకు ఇంకా బలం లేదు.

నువ్వు ఇప్పుడు ఏడుస్తావు.
ఇంత చిన్నప్పుడే ..
ఆ పులి నిను పట్టి ఊపుతుంది..ఇదెలా?

"నాన్నా నువ్వెందుకు ఇలా ఏడుస్తున్నావు ?లెగు"

మెల్లిగా నేను నా కళ్ళు తెరిచా.
అమ్మ అక్కడ ఉన్నది.

"నేను నిన్ను వదిలి ఎప్పుడెల్లను అమ్మా" అన్నా.
"వెళ్ళమని ఎవరు అన్నారురా?"అంది అమ్మ.

***
Geetanjali, 8th class, Rishi Valley School, 20-9-2007.
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.