*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Showing posts with label పిల్లల పుస్తకం. Show all posts
Showing posts with label పిల్లల పుస్తకం. Show all posts

Friday, November 22, 2013

అలుసుగా నన్నైయితే

Adthya  ,PreP Junior ,Prabhava 

















"పల్లవి "
అలుసుగా నన్నైయితే అంటావు గానీ
     ఎన్ని చేసినా నాన్నారిని ననవే?    

1.   నాన్న గారి బల్ల మీద కాగితాలు ఎన్నో ఉంటే
      గాలిపడగ కోసం ఒక్క కాగితం తీసుకొంటే
      కస్సుమంటూ నా మీద కోప్పడతావు                 "పల్లవి "

2.  నాన్నగారి బుక్కు తీసి చిన్ని పెన్సిల్తోను
     అ ఆలు నేను అందంగా రాస్తే
     కళ్ళెర్ర జేసి నన్ను కోప్పడతావు
     తెల్ల కాగితాల నిండా ఏదో ఏదో రాసేసి
      తెగపాడు చేసేస్తోంటే నాన్నారిననవేం?                "పల్లవి "

3.     గొప్ప గొప్ప గ్రంథాలు నాన్న గారివంటూ
       కొత్త కొత్త కవితలెన్నో అల్లేరు అంటూ '
       నాన్న గారినెప్పుడూ పొగిడేస్తూ ఉంటావు
       కమ్మగా నీ లాగా కథ చెప్ప గలరా?          
       హాయిగా నీలాగా పాట పాడగలరా?
      అమ్మా నాకు చెప్పవే -ఒకసారి
       నాన్న గారి రాతలు నీకర్దమవుతాయా?            "పల్లవి "

రచన : శ్రీ కవి రావు


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Friday, August 6, 2010

పిల్లనగ్రోవి


పిల్లలు కనబడగానే
పాఠాలు మొదలు పెడతాం
అలా ఇలా..అదీ ఇదీ...
అంటూ!

పిల్లలు అనగానే-
చెపితే వినవలసిన వాళ్ళు-
నేర్పితే నేర్వవలసిన వాళ్ళు-
అనుకుంటాం!

పిల్లలు అంటే-
గాలిపటాలు,కాగితం పడవలు
పోకీమాన్లు ,మిక్కీమౌస్లు
చాక్లెట్లు మెర్రి-గో-రౌండ్లు
అంతేనా?

పిల్లలంటే -
భాష
భావం
సజీవ చైతన్యం

పిల్లలంటే -
దేదీప్యమాన కళలు
తేనెలతేటల మాటలు

అల్లిబిల్లిమాటలు
పిల్లనగ్రోవి పాటలు
పిల్లల కలాలు

పిల్లలు
చెపితే వినవలసిన వాళ్ళం
నేర్పితే నేర్వవలసిన వాళ్ళం 
మనం!

చంద్ర లత

pillana grovi ,(2006),Stories and Poems by Telugu students,Rishi Valley School
For copies : Rishi Valley School , Prabhava and all leading bookstores

***


Prabhava,Books and Beyond ! * All rights reserved.