*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Showing posts with label "పట్టు పువ్వులు * పిల్లల కలాలు " సంకలనం చిట్టి కలం. Show all posts
Showing posts with label "పట్టు పువ్వులు * పిల్లల కలాలు " సంకలనం చిట్టి కలం. Show all posts

Thursday, March 1, 2018

చెలీ సెలవ్…! సెలవ్  సెలవ్ !


అనేకానేక ఉద్యమాలకు ఊపిరై , ఉత్తేజమై నిలిచిన పాటను, ఈ రకమైన దిగజారుడు తిట్టుపాటలా తీర్చిదిద్దడం మన తెలుగు సినిమాకే దక్కింది. అన్నట్టు , ఆ తిరోగమన తిట్టుపాట కూడా సుప్రసిద్ధమే!
ఈ “చెలీ సెలవ్..!” పాట నేపథ్యం పట్ల, ఏ కించిత్ గౌరవం ఉన్న వారైనా, ఆవగింజంత అవగాహన ఉన్నవారైనా, సిగ్గుతో తల దించుకోకుండా ఎలా ఉంటాం? ఏదైనా  ఒక పాటను అనుసరించేటప్పుడు, అనుకరించేటప్పుడు, ఆ పాట ఆత్మను వంచించకుండా వుండే రోజులు ఎప్పుడు వస్తాయో !

https://chandralathablog.wordpress.com/2018/03/01/%E0%B0%9A%E0%B1%86%E0%B0%B2%E0%B1%80-%E0%B0%B8%E0%B1%86%E0%B0%B2%E0%B0%B5%E0%B1%8D-%E0%B0%B8%E0%B1%86%E0%B0%B2%E0%B0%B5%E0%B1%8D-%E0%B0%B8%E0%B1%86%E0%B0%B2%E0%B0%B5%E0%B1%8D/








Prabhava,Books and Beyond ! * All rights reserved.

Friday, October 25, 2013

అప్పుడు వచ్చే వర్షం


అడవిలో జంతువులమ్మా జంతువులు.
నీటి కోసం తనకలాడే జంతువులు.
అప్పుడు వచ్చే వర్షం.
జంతువులన్నిటి ఆనందమైన వర్షం.
చేపలు బతికేటందుకు వచ్చే వర్షం.
మా అందరికీ ఆనందమైన వర్షం.


వి. చరణ్ తేజ,   
6 తరగతి , విద్యావనం ,REC రిషీ వ్యాలీ పల్లె బడి.2005
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Tuesday, October 22, 2013

వర్షమై రావమ్మ












చిన్ని చినుకు చిలకమ్మ   
వర్షమై రావమ్మ
చిన్ని పాపలై మము చూడు
మా హృదయాలను తాకి చూడు
మేము కోరుకొన్న వర్షపు చినుకా!
మా వైపు రాఎందుకు ?
సిరి వెన్నెల నీ కొసమే ఉన్నది
నువ్వు చూడవేలా
అలా వచ్చి పోతావు
నీవే నా దేవా..
ఓ వర్షపు చినుకా !
***
లీలావతి   2005
6 తరగతి , విద్యావనం ,REC రిషీ వ్యాలీ పల్లె బడి.




Prabhava,Books and Beyond ! * All rights reserved.

Saturday, October 19, 2013

వర్షాలమ్మా వర్షాలు










ఊరికంతా ఇష్టమైన  వర్షాలు
అవి వస్తే ఆకాశంలో మబ్బులొస్తాయి
ఇవి వస్తే వూరి చెరువులు నిండేస్తాయి
వాగులు సరస్సులు పొర్లేస్తాయి
వర్షాలమ్మా వర్షాలు
ఊరికంతా ఇష్టమైన వర్షాలు

ఇవి వస్తే ఆకాశంలో  నక్షత్రాలు కనబడవు
అవి వస్తే తాగడానికి నీళ్ళొస్తాయి 
వర్షాలమ్మా వర్షాలు
ఊరికంతా ఇష్టమైన వర్షాలు

వీటి వలన చెట్లొస్తాయి.
చెట్టులోకి ఉడుతలొస్తాయి.
ఇంకా కాయలొస్తాయి.
ఆడవారికి తలలో పెట్టుకోను పూలొస్తాయ్!
బీదవారికి మంటకోసం కట్టేలొస్తాయి

వర్షాలమ్మా వర్షాలు
ఊరికంతా ఇష్టమైన వర్షాలు
***
వి. చరణ్ తేజ
6 తరగతి , విద్యావనం ,REC రిషీ వ్యాలీ పల్లె బడి.2005

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Thursday, October 17, 2013

వర్షపు చినుకా!

నీలి మబ్బులు నింగి లోన
ఎదురుచూసే వర్షపు చినుకా!
భూమిపై చేరేందుకు ఆకాంక్షగా ఉందా?
వర్షపు చినుకు భూమిపై చేరింది
తన ఆకాంక్ష తీరింది
భూమిపై తన మనసు హృదయాన్ని విడిచి

స్వచ్ఛమైన భూమికే అంకితమైంది.
***
లీలావతి  6 వ తరగతి. 2005

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Monday, October 14, 2013

అన్నీనీవే !






వానా వానా వానా!   
నీవు అంటే అందరికీ ఇష్టం.
నీ వలన పంటలు నష్టం.
ఊళ్ళు కొట్టుకు పోతున్నాయి.
బావులు నిండితే లాభం.
లాభం నష్టం అన్నీనీవే!
ఓ వానా వానా వానా !
***
విద్యానంద్ ,
6 వ తరగతి ,విద్యావనం , 
రిషీవ్యాలీ  పల్లెబడి. 2005
****

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Friday, September 20, 2013

కల ”కలం”

మా తాత గారి తండ్రి వ్యాపారపు పని మీద అమెరికాకు వెళ్ళినప్పుడు, మా తాతగారి కోసం ఒక కలం తెచ్చారట.
మా తాత గారు కలమును బంగారం కంటే విలువైనదిగా చూసుకొనే వారు. అన్ని పరీక్షలు కలంతోనే రాసేవారు. మా తాత గరికి పదవతరగతిలో తొంభై రెండు శాతం  మార్కులు వచ్చాయి
Image 1ఊరిలోని వారందరూ ,మా తాతగారికి కలం వలననే మార్కులు వచ్చాయని  అనడం మొదలు పెట్టారు. బంధువులు ,ఊరివారందరూ తాతగారిని ఎంతో మెచ్చుకొన్నారు. కానీ, అతను చదువులో పెట్టిన ధ్యాస, శ్రమ కాకుండా ,పరీక్ష వ్రాయుటకు వాడిన కలాన్ని మెచ్చుకున్నారు. దానితో మా తాతగారికి కలం మీద కోపం కలిగి ,దానిని ఒక మూల పడవేశారట .
కొంత కాలం గడిచిన తరువాత కూడా కలం గూర్చి ఎవరూ మర్చి పోలేదు. మా తాత ఊరు వదిలి వెళ్ళాక ,అతనిని  గూర్చి మనుష్యులు మర్చిపోయారు .కానీ, కలం గూర్చి ఎవరూ మర్చి పోలేదు.   పెద్దలందరూ చిన్నపిల్లలకు కలం గురించి చెప్పే వారు. తన ఊరి మీద కోపంతో ,మా తాతగారు ఉద్యోగం చేయడానికి వెళ్ళి,ఎప్పుడూ ఊరికి తిరిగి వెళ్ళ లేదు.
చాలా సంత్సరాలు గడిచాక ,ఒకసరి మా నాన్నతో నేను ,మా ముత్తాతను కలవడానికి మా ఊరికి వెళ్ళాను.
మా ముత్తాతకు 90 ఏళ్ళ పై వయసు. అతను సరిగ్గా మాట్లాడడం లేదు. నడవలేరు కూడా.
అక్కడికి వెళ్ళినప్పుడు, ఊరిపెద్దలు నాకు  ఒక కలం గురించి చెప్పారు. అది మా తాత గారిదని ఎవరూ చెప్పలేదు. ఎవరికీ గుర్తులేదు కాబోలు. అన్ని సంత్సరాలు కథ చెప్పడంలో , కథలో ఇతరకథలు కలగాపులగం అయిపోయాయి.   కలము వాడిన వాడు అసలు చదువుకొనే వాడు కాదు కానీ , కలంతో వ్రాయుటం వలన  అతనికి నూటికి నూరు మార్కులు వచ్చాయని నాకు చెప్పారు.
నేను పదవ తరగతిలో ఉన్నాను. ఇంకా రెండు మూడు నెలలలో మా పరీక్షలు మొదలవుతాయి. మా స్నేహితుడు అసలు చదువుకోడు. తనకి కలం ఇస్తే బావుంటుందని అనుకొన్నాను .
  కానీ, అటువంటి కలం ఎక్కడనుండి  తీసుకు రావాలో ఎవరికీ తెలియలేదు.  కొనాలన్నా కలం పేరేమిటో కూడా తెలియదు. ఊరిలో పెద్దలను కలం పేరడిగితే , దాని పేరు తెలియదు కానీ , దీనిలో ఇంకు మళ్ళీ మళ్ళీ నింపవచ్చని చెప్పారు.
నేను పట్టణానికి తిరిగి వచ్చాక , మా స్నేహితుడికి కలం గురించి చెప్పాను
అతను  వెంటనే ఆ కలం కావాలి అనెను
రోజు నుండి మేము ప్రతి దుకాణానికి వెళ్ళి ,ఇంకు మళ్ళీ మళ్ళీ పోయాల్సిన కలం కోసం అడిగాము. అటువంటి కలాలు ఒకటో  రెండో ఉంటాయనుకొన్నాము. కానీ, ప్రతి దుకాణంలో పది కంటే ఎక్కువ ఉన్నాయి. ఇంక లాభం లేదని మేము నమూనకు ఒక కలం కొన్నము
బోర్డు  పరీక్షలకు ముందు జరిగే పరీక్షలలో మా స్నేహితుడు కలాలను వాడి చూశాడు. కానీ ,మా స్నేహితుడు  పరీక్షలోను పాస్ అవ్వలేదు
రోజూ కలం  కోసం వెతకడంలో  " హీరో " క్యాంలిన్" వంటి కలాల పేర్లను నేర్చుకొన్నాము కానీ , చదువు ఏమీ నేర్చుకోలేదు.
నేను ఇలా రోజూ బయటకు వెళ్ళడం చూసి మా నాన్న నన్ను విషయం ఏమిటని అడిగారునేను తనకు  పూర్తి  కథ చెప్పాను. నేను చెప్పినదంతా విని ,నవ్వి, తన జేబులోనుంచి ఒక కలాన్ని బయటకు తీసారు. " కలం ఇదే !"అన్నారు. ఆశ్చర్యంతో నేను కలం తీసుకొని చూస్తే ,దాని మీద "పార్కర్" అని వ్రాసి ఉంది.
ఇంక రెండు రోజుల్లో మా పరీక్షలు. వెంటనే ,నేను మా స్నేహితుడి ఇంటికి పరిగెట్టాను.
తనతో కలిసి దుకాణమునకు వెళ్ళి, దుకాణ దారు ముందు మా దగ్గర ఉన్న యాభై రూపాయలను  పెట్టాము. ఒక పార్కర్ పెన్ను ఇవ్వమని అడిగాము.
అతను నవ్వి, "కేజీ టమటాలే వంద రూపాలు. యాభై రూపాయల్కౌ పార్కర్ పెన్ను  ఎక్కడ దొరుకుతుంది ?" అని అడిగాడు.
అప్పుడు మా ఇద్దరికీ మా తప్పు తెలిసింది. మేము ఎప్పుడూ వంద రూపాయల కంటే  ఎక్కువ కలం ఉంటుందని అనుకోలేదు. వంద రూపాయలకంటే తక్కువ కావాలని అడిగాం కాబట్టి ఖరీదైన కలాన్ని దుకాణ దారు  మాకు చూపెట్టలేదు. ఎంత అడిగినా అతను మాకు పెన్ను ఇవ్వ లేదు.
అందుకనే ,నేను ఇంటికి వెళ్ళి ,మా నాన్న ను బ్రతిమిలాడాను. కలాన్ని మా స్నేహితునికి పరీక్షలు వ్రాయడానికి ఇచ్చాను.
పరీక్షలు అయిపోయాయి. ఫలితాలు వచ్చాయి.                                       
అప్పుడు తెలిసింది
నేను  మా స్నేహితుడు పరీక్షలలో బాగ చేయ లేదు. మా స్నేహితుడు పాస్ కూడా కాలేదు
ఆ  కలం వెతుకులాటలో చిక్కుకు పోయి , చదవడం పూర్తిగా మానివెశాం. మాకు సరియైన శిక్ష. కలం గురించిన కథ అంతా ఒక మూడ నమ్మకం అని తెలుకొన్నాము. అప్పటినుండి మేము మూఢ నమ్మకాలను నమ్మ కుండా. ఏమి చేసిననూ, శ్రద్ధ, ధ్యేయంలతో చేశాము.
కలం కోసం నేనూ నా స్నేహితుడు చేసిన ప్రయత్నాలన్నీ జ్ఞాపకం వచ్చినపుడల్లానిపిస్తుంది.
"ఒక చిన్న కలం ఎంత కలకలం రేపిందీ ! "అని.
***

ప్రకృతి ,
పదవ తరగతి ,రిషీ వ్యాలీ పాఠశాల ,3-9-2013
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Wednesday, August 28, 2013

కనిపించీ కనిపించనట్లు

కనిపించీ కనిపించనట్లు
ఓ వెలుగు.
ఓ ఆశ.
ఓ కోరిక.

ఓ కొత్త చూపు.
ఓ కొత్త దారి.
ఓ కొత్త పట్టుదల.

ఓ వెచ్చని మాట.
ఓ కమ్మని పాట.
ఓ చల్లని చినుకు.

పాపాయి చిరునవ్వులా.
అమ్మ జోలలా
ఓ మధురమైన కావ్యములా

కనిపించీ కనిపించ నట్టు..
ఓ క్షణం.
అంతే!
మాయమైనదా?

***
దుహితా గంగూలీ.
Duhitha Ganguly
10 తరగతి,రిషీ వ్యాలీ పాఠ శాల. 
1-10-2005
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Sunday, August 25, 2013

చంద్రుడంటే ...?!?
















చీకటికి గుర్తు చంద్రుడు.
నక్షత్రాల మధ్య కాంతుడు చంద్రుడు.
సూర్యుడికి విరోధీ చంద్రుడు.
రాత్రికి రారాజు చంద్రుడు.
శుక్లపక్షంలో తరుగును చంద్రుడు.
కృష్ణపక్షంలో తరుగును చంద్రుడు.

వెన్నెల నిచ్చే ఈ చంద్రుడు.
చక్రవాకాలు ఎదురుచూసే చంద్రుడు
పాపాయి మారాం చేసే చంద్రుడు
మనందరి మామ చంద్రుడు
మరి రోజుకొక రూపం ఎత్తుతాడెందుకో?
***
రేరాణి సువాసనలు చిమ్మేది చంద్రుడి కోసమే.
సముద్రంలో అలలు ఎగిసేది చంద్రుడి కోసమే
కలువలు వికసించేది చంద్రుడి కోసమే 
వీటన్నిటికి చంద్రుడంటే ఎంత ప్రేమో!
***
చంద్రుని మీద కుందేలుందని ఒకరంటే,
దాని ఉన్నది ముసలమ్మ అంటారు ఇంకొందరు.
కాని,శాస్త్రవేత్తలు చెప్పే నగ్న సత్యం 
చంద్రుడు ఒక గ్రహం. దాని మీద లేదు జీవం!
***
తాన్య
6వ తరగతి,రిషీ వ్యాలీ పాఠ శాల.
1-10-2007
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Tuesday, February 14, 2012

రాగుల్లో ఇసుక


ఒక ఊరిలో ఒక పిల్లవాడు ఉన్నాడు.అతనికి ఒక గుడ్డం ఉంది.దానిలో రాగులు చల్లారు.అతను ఎప్పుడూ గోలీలు ఆడుతుంటాడు.వాళ్ళ నాన్న వచ్చి ఎప్పుడూ గోలీలు ఆడుతుంటాడు.
వాళ్ళ నాన్న వచ్చి," ఎప్పుడూ గోళీలు ఆడుకోకొంటుంటే,రాగి చేని కాటికి పోవచ్చుకదా ?"అందువలన అబ్బాయి తను తరిమి తరిమి అతను అలసిపోయి ,గమ్ముక్కూర్చునేశాడు. గువ్వల్ను తరమ లేక ఏడుస్తున్నాడు.
సరస్వతి పరబ్రహ్మ అటు వెళుతున్నారు. పార్వతి అతని ఏడ్పు విని, ఎందుకని అడిగింది.
"మాకు ఒకేఒక గుడ్డం ఉంది.దానిలో రాగులు చల్లాం.గువ్వలను ఎంత తరిమినా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి.తరిమి తరిమి ,ఇప్పుడు తరమ లేక ఏడుస్తున్నాను"
అప్పౌడు పార్వతి అడిగింది,"ఇక్కడ ఎక్క్డైనా ఇసుక ఉందా ?"
"ఉంది" అనండు పిల్లవాడు.
ఇసుకకు ఏదో మంత్రం వేసి అతని జేబిలో వేసింది.

"ఏంటి అక్కా ఇది ?" అని అడిగాడు పిల్లవాడు.
"చిలకలు గువ్వలు అన్నీ తింటున్నాయి కదా?అప్పుడు "ఓం భీం" అనుకొని దాన్ల మీద వేయి.అవి చనిపోతాయి"అంది.

గువ్వలు పిట్టలు రాగిచేను పైకి వచ్చాయి.
అప్పుడు పిల్లవాడు ఇసుకను "ఓం భీం " అని ,పిట్టలపై చల్లాడు.అవి మొత్తం చని పోయాయి. టూవాలులో వేసుకొని ఇంటికి బయలు దేరాడు.అమ్మకు ఇచ్చి కూర చేయ మన్నాడు.మళ్ళీ చేనుకి వెళ్ళాడు.మల్ళీ పిట్టలు రాలేదు.
ఇంటికి వచ్చి అమ్మను అన్నం పెట్టమని అడిగాడు.
అప్పటికే అమ్మా నాన్న అన్నం తినేసి ,తాంబూలం వేసుకొంటున్నారు. అమ్మ పిల్లవాడికి అన్నం పెట్టి,ఊట వేసింది.
పిల్లవాడికి కోపం వచ్చింది.
తాంబూలం  తింటున్న అమ్మనాన్నలపై "ఓం భీం "అని ఇసుక చల్లాడు.
వాళ్ళు చనిపోయారు.
చేనుకు పొయ్యేవారు లేరు
రాగులు పండి పిట్టల దండున పడ్డాయి
అమ్మా నాన్న అన్నం ఏమీ లేవు.
ఒక సంచి,గిన్నె,గ్లాసు, ఒక బాటిల్ ఎత్తుకొని. పల్లెల్లో అడక్క తింటున్నాడు.
ఇప్పుడు కూడా ఎప్పుడైనా రాగుల్లో ఇసుక వస్తే అది ఆ పిల్లవాడు చల్లిందే నన్న మాట!

***
పి.పల్లవి,6 తరగతి,ZPHS పాఠశాల,తెట్టు.
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Thursday, February 9, 2012

ఒక వడ్రంగి పిట్ట




నేను ఒక కొబ్బరి చెట్టును.
అది వేసవి కాలం.
ఒక రోజు నా దగ్గరికి ఒక వడ్రంగి పిట్ట చ్చి , తన ముక్కుతో పొడిచి పెద్ద రంధ్రం పెట్టింది.
నాకు చాలా నొప్పివేసింది.నేను దానిని భరించాను.
అది రంధ్రంలో 4 రోజులు నివసించి ,4 గుడ్లు పెట్టి తన తండ్రితో వేరే చోటుకు వెళ్ళింది.
కారణం గుడ్లను అది నాలుగు రోజులు పొదిగింది.పిల్లలు గుడ్లనుంచి రాలేదు. అది బాధ పడి వేరే చోటుకు వెళ్ళింది. నేను గుడ్లను కొన్ని రోజులు రక్షించాను.
 ఒక రోజు ఒక నరుడు కొబ్బరికాయల కోసం నా మీదికి ఎక్కాడు. కాలు జారి కింద పడ్డాడు.
మరుసటి రోజు మరొక నరుడు ఎక్కాడు. గుడ్లను చూస్తాడేమో అని చాలా భయ పడ్డాను.నాకు అప్పుడు నరుడు గుడ్లకోసం ఆశ పడడు.కొబ్బరికాయల మీద ఆశ ఎక్కువ  అని ఆలోచన తట్టింది.
నా స్నేహితుడైన చింతచెట్టు కొమ్మలతో గుడ్లు ఉన్న రంధ్రము ను మూసివేశాను. గుడ్ల మీద ఎవరు చాలా రోజులు దృష్టి ఉంచలేదు
తరువాత ఆ  పక్షి తిరిగి నా వద్దకు వచ్చింది.
వరసగా పదకొండు రోజులు గుడ్లను పొదిగిందిఅప్పుడు గుడ్లనుండి నాలుగు పిల్లలు వచ్చాయి.
పక్షి సంతోషించి, తన చెల్లి అయిన కౌజు పిట్టకు ,అక్క అయిన పావురము ను కూడా చెట్టులోనే గూడు కట్టుకోమని చెప్పింది
అప్పటి నుంచి ,నా స్నేహితుడు  అయిన చింత చెట్టు పైనానా పైనా   చాలా గూళ్ళు ఉన్నాయి.
అది చూచి నాకు ఎక్కడ లేని సంతోషం కలిగింది.
***
పి .రాజు, 7 తరగతి, రిషీవ్యాలీ పల్లె బడి,6.9.11
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.