*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Showing posts with label చిట్టి కలం. Show all posts
Showing posts with label చిట్టి కలం. Show all posts

Monday, September 2, 2013

ఒకానొక చెప్పు !

Infant/Toddler Boys' Robeez Luke - Greyనేను ఒక వాసన వస్తోన్న చెప్పుని.
అందరూ నా దగ్గరకు రాగానే
ముక్కు మూసుకొంటారు.
మీరు వాసన తట్టుకోలేక పోతే,
నేను ఎంత వాసన భరించాలి?
ఆలోచించండి!


I am a stinking Shoe.
Everyone closes their nose 
When they see me.
If you can't bear the smell,
Then what should I do ?
***
నివేద్,     7-9-2011
Nived,
* 8 th Class
*Rishi Valley School
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Wednesday, August 28, 2013

కనిపించీ కనిపించనట్లు

కనిపించీ కనిపించనట్లు
ఓ వెలుగు.
ఓ ఆశ.
ఓ కోరిక.

ఓ కొత్త చూపు.
ఓ కొత్త దారి.
ఓ కొత్త పట్టుదల.

ఓ వెచ్చని మాట.
ఓ కమ్మని పాట.
ఓ చల్లని చినుకు.

పాపాయి చిరునవ్వులా.
అమ్మ జోలలా
ఓ మధురమైన కావ్యములా

కనిపించీ కనిపించ నట్టు..
ఓ క్షణం.
అంతే!
మాయమైనదా?

***
దుహితా గంగూలీ.
Duhitha Ganguly
10 తరగతి,రిషీ వ్యాలీ పాఠ శాల. 
1-10-2005
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Sunday, August 25, 2013

చంద్రుడంటే ...?!?
















చీకటికి గుర్తు చంద్రుడు.
నక్షత్రాల మధ్య కాంతుడు చంద్రుడు.
సూర్యుడికి విరోధీ చంద్రుడు.
రాత్రికి రారాజు చంద్రుడు.
శుక్లపక్షంలో తరుగును చంద్రుడు.
కృష్ణపక్షంలో తరుగును చంద్రుడు.

వెన్నెల నిచ్చే ఈ చంద్రుడు.
చక్రవాకాలు ఎదురుచూసే చంద్రుడు
పాపాయి మారాం చేసే చంద్రుడు
మనందరి మామ చంద్రుడు
మరి రోజుకొక రూపం ఎత్తుతాడెందుకో?
***
రేరాణి సువాసనలు చిమ్మేది చంద్రుడి కోసమే.
సముద్రంలో అలలు ఎగిసేది చంద్రుడి కోసమే
కలువలు వికసించేది చంద్రుడి కోసమే 
వీటన్నిటికి చంద్రుడంటే ఎంత ప్రేమో!
***
చంద్రుని మీద కుందేలుందని ఒకరంటే,
దాని ఉన్నది ముసలమ్మ అంటారు ఇంకొందరు.
కాని,శాస్త్రవేత్తలు చెప్పే నగ్న సత్యం 
చంద్రుడు ఒక గ్రహం. దాని మీద లేదు జీవం!
***
తాన్య
6వ తరగతి,రిషీ వ్యాలీ పాఠ శాల.
1-10-2007
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Thursday, April 11, 2013

ఇదిగిదుగో ఉగాది !

వేప చెట్టు చూడండి
అందమైన చెట్టు అది
ఆకులన్ని పచ్చగా
పువ్వులేమో తెల్లగా
ఒక పువ్వు నోటిలోకి పెట్టుకున్నాను
వెంటనే కళ్ళు తిరిగి పడిపోయాను
ఆ పూతను గిన్నెలోకి వేసుకున్నాను.

చెరుకు గడని చూడండి
చాలా పెద్ద గడ అది
దాని తీపి రసం పిండాకా,
బెల్లం తయారు చేశాకా,
బెల్లం ముక్క తిన్నాను.
పొట్ట నొప్పితో చచ్చాను.
ఆ బెల్లాన్ని గిన్నెలోకి వేసుకున్నాను.


చిన్నచిన్న పొదలు - చిటారి కొమ్మలు -
వాటికి వేలాడి ఉన్నాయి కాయలు
ఆ కాయలు ఎర్రవి, పచ్చవి
కొన్ని చేదువి, కొన్ని వగరువి
ఒకటి నోటిలోకి పెట్టాను.
వగరుదనం వల్ల రోజంతా 
ఏమీ తినలేకపోయాను.
ఆ కాయలు కోసి గిన్నెలోకి 
వేసుకున్నాను.

మిరప పొదలు ఎన్నో ఉన్నాయి.
రంగు రంగుగా కళ్ళకు బాగున్నాయి.
చూద్దామని ఒకటి నోటిలోకి పెట్టాను.
కారంతో మండి చచ్చాను.
ఆ కాయనూ గిన్నెలోకి వేసుకున్నాను.

ఒక మామిడి చెట్టు చూశాను
పచ్చి మామిడికాయ కోశాను.
ఆ పుల్లదనంతో కళ్ళు మూశాను.
అయినా, గిన్నెలోకి వేసాను.

ఇవన్నీ ఒకటొక్కటిగా తినటం కష్టం.
ఆ ఐదు వేరే వేరే రుచులు
వాటిల్ని కలిపితే ఒక అభిరుచి తయారవుతుంది
దాని పేరే ఉగాది పచ్చడి

అలాగే జీవితం 
అన్ని రసాలు కలిసినది
అందుకనే మనం దేముడికి 
ధన్యవాదాలు చెప్పాలి.

*                                                
నివేద్,
9వ తరగతి
రిషీ వ్యాలీ పాఠశాల
*** 
మరికొన్ని పిల్లలకవితలు
 http://chandralata.blogspot.in/
http://www.prabhavaschool.com/

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Sunday, February 5, 2012

చెట్టు చివరన

"అమ్మా అమ్మా ఎక్కడికెళ్ళావ్
నువ్వు ఆపదలో చిక్కుకొన్నావా?
వేటగాడు వలవేసి పట్టుకెళ్ళాడా?

అమ్మా అమ్మా ఆకలిగా ఉంది.
త్వరగా వచ్చేయమ్మా.

నువ్వు తిరిగి తిరిగి అలసిపోయావా?
చెట్టుకింద పడిపోయావా?
లేక దారి తప్పి పోయావా?"

అని,
 పిట్టపిల్లలు అమ్మను వెతకడాని వెళ్ళారు.

అమ్మ తిరిగి పిల్లల దగ్గరకి వచ్చింది.
 ఖాళీ గా ఉన్నగూడు చూసి దిగులు పడింది.

"పిట్టా పిట్టా ఎక్కడికి వెళ్ళారు?
గద్ద వచ్చి తీసుకు పోయినిందా ?
సర్పం వచ్చి మింగి వేసిందా?
నా కోసం వెతక డానికి వెళ్ళారా?"

అని ,
అమ్మ పిట్టపిల్లలను వెతుకుతూ పోయింది.
గూడు వాళ్ళకోసం చూస్తూ..
వంటరిగా ఉండిపోయింది
చెట్టు చివరన.

***
బి.తేజ. 9 వ తరగతి, ZPHSతెట్టు.
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Tuesday, January 31, 2012

చివరి జీవి



ఎందుకో పావురమా 

తెల్లగా ఉంటావు
ఎగురుతూ ఉంటావు
తేలికగా ఉంటావు

ఎందుకో పావురమా
అందమైన దానివి నువ్వే
సున్నితమైన దానివి నువ్వే

ఎందుకో పావురమా
దానిమ్మ గింజలాంటి కళ్ళు నీవే

కొక్కీ లాంటి ముక్కు నీదే

ఎందుకో పావురమా
ఈ భూమిపై చివరి దానివీ నీవే
ఆ పై ఇంకెవరూ లేరే!

***

ఎం.మురళి, 6 వ తరగతి ZPHS స్కూలు ,తెట్టు 
                                                                                ***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Monday, January 30, 2012

అమ్మ ఏది?


అన్నయ్య ..అన్నయ్యా..అమ్మ ఏది?

త్వరగా రమ్మను అన్నయ్య.
నాకు చాలా భయం వేస్తుంది.

అమ్మ స్పృహ తప్పి పడిందా?
ఎవరైనా ఆసుపత్రికి తీసుకెళ్ళారా?

అమ్మ దారి తప్పి పోయిందా?
స్నేహితులతో మాట్లాడుతుందా? అమ్మని ఎవరైనా వేటాడారా?

ఆ..అదుగో అమ్మ వస్తోంది.
అమ్మాయ్యో ..అది అమ్మ కాదు .
అది ఒక గబ్బిలం !

అన్నయ్యా..అన్నయ్యా..అమ్మ ఏది?

***
వేద ,9వ తరగతి, రిషీ వ్యాలీ స్కూలు.
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Tuesday, January 24, 2012

ఇదే..!?!




మంచి బట్టలు
ఖరీదైన కంప్యూటర్లు
కొత్త కార్లు

ఇదేనా స్వర్గం?

పెద్ద చెట్లు
చల్లని గాలి
చిన్న తూనీగలు
పసుపుపచ్చ పూలు
మధ్యలో నువ్వు

ఇదా స్వర్గం!

***
కృష్ణ ,
9 వతరగతి, రిషీవ్యాలీ పాఠశాల, 2006
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Friday, January 20, 2012

ఆ రథాలు..!?!

templecart
చూశాను ఒక రథము

దాని మీద చాలా స్తంభములు

పైన ఉంది ఒక కలశం

దాని కింద గోపురం




కూర్చున్నాను రథ చక్రం మీద
ప్రక్క స్కూలులో అందరూ పేద










లక్షలతో కట్టుతారు ఈ రథము !
అది అంతా ఎవరికోసము?
చచ్చిపోతున్న మనుషులు
డబ్బు లేని పురుషులు

అవసరమా ఈ రథాలు?
అవసరమా ఈ దేవుళ్ళు?

***
ఆకాశ్ ,
ఆరవ తరగతి, రిషీవ్యాలీ పాఠశాల,
2006
***


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Saturday, October 8, 2011

నాకు పుట్టుక లేకుంటే..?!?


నేనే కానీ ఒక కొండై పుడితే..

నా మీద వెలసిన
చెట్లను నరికేస్తుంటే..
బండలు పెరికేస్తుంటే..
ఇక మీదట నాకు పుట్టుక లేకుంటే..
నన్ను నేనే రక్షించుకోవాలి!

నేనే కానీ ఒక కొండై పుడితే ..
భూదేవిని వానదేవున్నీ  నన్ను కాపాడమంటా!
భూదేవిని రాళ్ళను పుట్టించమంటా.
వానదేవున్ని వర్షాలు కురిపించమంటా.

నేనే కానీ ఒక కొండై పుడితే ...
ఎన్నో రకాల దేవుళ్ళను వేడుకొనేస్తా.
నా తరం వారిని ఇంకా పుట్టించమంటా.

మనుష్యుల నుంచి విముక్తి కలిగించమంటా.

*పి. రెడ్డిరాణి ,8వ తరగతి,ZP హై స్కూలు ,తెట్టు




Prabhava,Books and Beyond ! * All rights reserved.

Thursday, October 6, 2011

ఒకటీ ... ఓయమ్మో !


స్త్రీ  అనే ఒక అక్షరం కోసం..
విద్య అనే రెండు అక్షరాలను వదిలేసి..
చదువు అనే మూడు అక్షరాలకు దూరమై..
జీవితం అనే నాలుగు అక్షరాలకు బానిసై..
జీవించడం అవసరమా ..నేస్తమా!
***
 జి.ఇంద్రజ, 8వ తరగతి, ZP హై స్కూల్
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Sunday, October 2, 2011

చెరో దారి



నేనే ఒక పిచ్చుకనయితే..
నాకు రెండు పిట్టపిల్లలు ఉంటే..
నేను ఆహారం కోసం వెళితే,
నా పిల్లలు నాకోసం ఎదురు చూస్తూ ఉంటే ,
వాళ్ళు విధంగా అనుకొంటే ,
' మా అమ్మకు ఆహారం దొరక లేదా?
అక్కడ ఎదైనా ఆపద వచ్చిందా?
వేటగాడి వలలో చిక్కుకుందా?
దారి ఏమైనా తప్పిపోయిందా?
ఆహారం కోసం వెతికి వెతికి అలసి పోయిందా?
ఆహారం కోసం వెతుకుతూ, తగిలి ఏమైనా పడి పోయిందా?
స్నేహితులతో మాట్లాడుతూ ఉందా?
మనల్ని మరిచి పోయిందా?"
నా కోసం పిట్టలు అరుస్తుంటే,
నన్ను వెతుకుతూ పిట్టలు ఒక దారి పోతే..
నేను గూటికి మరోదారిన చేరైతే..
పిల్లలు ఒక దారి . నేను మరోదారి!

S.రెడ్డి రాణి, 9 తరగతి,  ZP హై స్కూలు ,తెట్టు
5-9 -11
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Friday, September 30, 2011

పిట్టమ్మ ప్రేమ !

అలసి పోయి పిట్టలు...
చెట్టు నుండి చూస్తూ...



అమ్మ రాని విషయం...
తలుచుకొనె బాధతో.

'అమ్మను వేటాడేమో..
అమ్మ దారి మరిచి పోయిందేమో..'


ఆహారం వెతికి వెతికి...
దొరకక అమ్మ తిరిగి వచ్చె.


అమ్మ వచ్చిన సంతోషంలో..
ఆకలినే మరిచాయి  పిట్టలు  .


ఆనందంతో ఆనందాన్నే తిన్నాయవి.
ఆకలి కన్న అమ్మప్రేమ తియ్యనిదిగా!
***

పి.రోహిణి,    9 తరగతి,  ZP హై స్కూలు ,తెట్టు
5-9 -11

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Tuesday, September 20, 2011

వీధి వీధి లో రాగులు

రామాపురం అనే వూరిలో గోపాల్ అనే రైతు ఉండే వాడు.
అతను ఒక రోజు రాగులు పంట వేయాలని అనుకొన్నాడు. అంగడికి వెళ్ళి రాగులు తీసుకొని వచ్చాడు.
ఆ రాగులను పొలంలో వేసి పంట పండించాడు.
ఆ రాగులను వూరిలో అమ్మాలనుకొన్నాడు.
ఎవరూ కొనలేదు.
మదనపల్లికి వెళ్ళి అమ్మాలనుకొని, మదనపల్లికి వెళ్ళాడు.
మదనపల్లిలో వీధి వీధికి వెళ్ళి అమ్మాడు.
ఎవరూ కొనలేదు.
అక్కడికి ఒకామె వచ్చి,
 "ఏంటయ్యా ,చీప్ గా రాగులు అమ్ముతున్నావు ?"అని అడిగింది.

ఇంతలోనే మరొకామె వచ్చింది. "అర కిలో రాగులివ్వు "అని అడిగింది.

"ఏమిటమ్మా టౌన్ లో ఉండీ చీప్ గా రాగులు కొంటున్నావు ?"అని అడిగింది మొదటి ఆమె.
"నీకేం తెలుసు రాగుల్లో బలం ?" అంది రెండో ఆమె.
"రాగుల్లో ఉన్న బలమేమి చెప్పమ్మా" అంది మొదటామె.
"అది చెపితే తెలిసేది కాదు.తింటే తెలుస్తుంది! "అన్నది రెండో ఆమె.
ఆమె మాట విన్న పక్క వారు కూడా వచ్చి రాగులు కొన్నారు.
అలా వక్కరికి వక్కరు చెప్పుకొని ,అందరూ కొనుక్కొన్నారు.

అలా కొని,ఆ రాగులు తినడం ద్వారా అందరు ఆరోగ్యంగా ఉన్నారు.
"ఎవరైనా సరే, ప్రిస్టేజీకి పోకుండా రాగులు కొనాలి. అవి మాత్రమే కాదు మిగిలిన కూరగాయలు ,పండ్లు కూడా తినాలి." రెండో ఆమె అంది.
అందరు కొనడం ద్వారా, గోపాలు మళ్ళీ రాగుల పంటేసాడు.కూరగాయలు పండించాడు.

***
బి.నందిని  ,6 వ తరగతి,జిల్లా పరిషత్ హైస్కూలు , తెట్టు
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Sunday, September 18, 2011

పిచ్చుక ముక్కు

 The Hindu,                        5.9.11

చూసేవాళ్ళను బట్టి లోకం ఉంటుంది.
అది సరే కానీ, చూసే వారినిబట్టే చిత్ర"లేఖనం" ఉంటుంది!
 హిందూ లో వచ్చిన పై బొమ్మ చూపించి ,
మీకు నచ్చినట్లు రాయమంటే,
ఇదుగోండి ఇలా రాశాడు, నివేద్!
****

ఒక సారి ఒక చిన్న పిచ్చుక ఉండేది.
తన అమ్మ పొద్దున్నే వెళ్ళి,
 పిల్లపిచ్చుక కోసం ఒక పండయినా రొట్టయినా తెచ్చేది.

ఒకసారి అమ్మ పిచ్చుక భోజనం వెతకడానికి వెళ్ళి,
ఎన్ని రోజులయినా రాలేదు.
అప్పుడు పిల్లపిచ్చుక తన కోసం వెతుకుతూ వెళ్ళింది.
చాలా రోజులు వెతికినా అమ్మ పిచ్చుక   కనబడలేదు.

ఒక రోజు హాస్పత్రి పక్కన నుండి  వెళ్ళేటప్పుడు ,
కిటికీలో తన అమ్మ కనిపించింది.
"అమ్మా! అమ్మా! ఏమి అయ్యింది?" అని అడిగింది.
"నేను ఆపిల్ కంపెనీ సింబల్ చూసి ,అది ఒక ఆపిల్ అనుకొని,
ముక్కుతో గట్టిగా పొడిచాను .దాని వల్ల నా ముక్కు విరిగి పోయింది." అని చెప్పింది.
**
నివేద్ ,8 వ తరగతి ,రిషీవ్యాలీ స్కూల్ .6-9-11

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Friday, September 16, 2011

నేనే నేనే రాగినయితే ?


నేనే నేనే రాగి అయితే, 
నన్ను పొలంలో చల్లుతారు.
నన్ను "అంగళ్ళు"లో అమ్ముకొంటారు.

నేనే నేనే రాగినయితే,
నన్ను రాగి పిండిని చేస్తారు.
నన్ను సంగటిని చేస్తారు.
నన్ను రొట్టెలను చేస్తారు.

నేనే నేనే రాగినయితే,
తెలియని వారు
"ఛీ ఛీ!" అంటారు!
తెలిసిన వారు
"అబ్బా.. ఎంత బావుందో" అంటారు!

***
యస్. సాయి చరణ్,
6 వ తరగతి, ZPహైస్కూల్, తెట్టు 7-9-11


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Thursday, August 18, 2011

మళ్ళీ అంతా మొదలయ్యింది!



సూర్యుడు బాగా మెరుస్తున్నాడు.
ఇంతలో వర్షం కురవడం మొదలయ్యింది.

ఇంద్రధనుస్సు ఏడు రంగులతో బయటకు వచ్చింది.
కళ్ళు అప్పగించి పిల్లలు చూస్తూ ఉండి పోయారు.



ఆ ఇంద్రధనుస్సు కింద ఓ కుండలో బంగారం దొరికింది.
చినుకులు ముత్యాలలాగా పిల్లల్ను తడిపేస్తున్నాయి.


వడగళ్ళు పడ్డాయి.
అవి ఇంద్రధనుస్సును విరగకొట్టేసాయి.


అప్పుడు పిల్లలకళ్ళలోంచి
వాన చినుకులులాగా కన్నీళ్ళు వచ్చాయి.



కొన్ని చినుకులు ఆకుల మీద
మణులుగా మారిపోయాయి.

పిల్లలందరూ ప్రతి ఆకు వద్దకూ వెళ్ళి
ముత్యాలను సేకరించారు.





చెట్టు మీద నుండి వాడి తల మీద
ముత్యం పడినపుడు "ఓ" అన్నాడు భవ తారక్.

ఆ చినుకులు సూర్యుడి మీదా పడుతున్నాయి.
అప్పుడు సూర్యుడు కూడా "ఓ" అని అరిచాడు.

మేఘాలు దగ్గరగా వచ్చేసాయి.
ఆకాశం  అంతా నిండి పోయాయి.

మళ్ళీ అంతా మొదలయ్యింది!

***

అమిత్ వీర, 6 వ తరగతి, రిషీవ్యాలీ స్కూలు, 2006







Prabhava,Books and Beyond ! * All rights reserved.

Saturday, August 13, 2011

ఎంత మంచి రోజు !


ఎక్కడ చూసినా మబ్బులు
హఠాత్తుగా ఉరుములు మెరుపులు

టప,టప,టప,టప ,టప
నా ముఖం మీద వాన జల్లు



ఒకటి రెండు మూడు
చూస్తూనే పెద్ద వర్షం

ఎక్కడి నుంచి వచ్చాయో
రెయిన్ కోట్లు గొడుగులు
గబగబ గబగబ పరుగులు

దూరంగా మిరప మందారం  నందివర్ధనాలు
మిల మిల మెరుస్తూ వజ్రాల్లా వానచుక్కలు 

దగ్గరలో ఓ చిన్న అబ్బాయి ఆశ్చర్య పడుతూ అన్నాడు.
" ఎవరు ఇలా కన్నీరు వదులుతున్నారు !"

అప్పుడే మేఘం చాటునుంచి 
ఇంద్ర ధనుస్సుతో పాటు వచ్చిన సూర్యుడు

"కాగితం పడవలు చేసిస్తావా?
ఆ చిన్న అబ్బాయి చిన్న కోరిక

పక పక మంటూ నన్ను పలకరించింది వర్షం






"ఎంత మంచి రోజు !"
అనుకొంటూ వెళ్ళానిక ఇంటికి.

***
ఆకాశ్,  6 వ తరగతి, రిషీవ్యాలీ స్కూలు, 2006



Prabhava,Books and Beyond ! * All rights reserved.

Thursday, August 11, 2011

మిగిలితేనా...!?!


ఆకాశంలోకి వెళ్ళేస్తా


నక్షత్రాలను కోసేస్తా


పూలబుట్టలో నింపేస్తా


భూమికి వచ్చేస్తా



నక్షత్రాలను నాటేస్తా 


చెట్లకు పూసిన నక్షత్రాలను  కోసేస్తా 


దేవుడికి మాలగా పెట్టేస్తా 


మా అమ్మకి నగలుగా ఇచ్చేస్తా


మిగిలితే ఆకాశంలోకి ఎగరేస్తా


***

మాల 5 వ తరగతి ,రిషీవ్యాలీ స్కూల్ ,2006
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Sunday, March 13, 2011

పూల నెమలి


చెట్టు చెట్టు చెట్టు
ఏమి చెట్టు?
వేప చెట్టు
ఏమి వేప?
కరివేప
ఏమి కరి?
నల్లి కరి
ఏమి నల్ల?
కాటుక నల్ల
ఏమి కాటుక?
కంటి కాటుక
ఏమి కన్ను?
నెమలి కన్ను
ఏమి నెమలి ?
పూల నెమలి
ఏమి పూలు?
మల్లె పూలు
ఏమి మల్లె?
సన్న మల్లె.

నాగేశ్వరి,7 వ తరగతి,రిషీవ్యాలీ పల్లె బడి.



Prabhava,Books and Beyond ! * All rights reserved.