*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Showing posts with label బుజ్జి కథలు. Show all posts
Showing posts with label బుజ్జి కథలు. Show all posts

Friday, September 20, 2013

కల ”కలం”

మా తాత గారి తండ్రి వ్యాపారపు పని మీద అమెరికాకు వెళ్ళినప్పుడు, మా తాతగారి కోసం ఒక కలం తెచ్చారట.
మా తాత గారు ఆ కలమును బంగారం కంటే విలువైనదిగా చూసుకొనే వారు. అన్ని పరీక్షలు ఆ కలంతోనే రాసేవారు. మా తాత గరికి పదవతరగతిలో తొంభై రెండు శాతం  మార్కులు వచ్చాయి. 
Image 1ఊరిలోని వారందరూ ,మా తాతగారికి ఆ కలం వలననే మార్కులు వచ్చాయని  అనడం మొదలు పెట్టారు. బంధువులు ,ఊరివారందరూ తాతగారిని ఎంతో మెచ్చుకొన్నారు. కానీ, అతను చదువులో పెట్టిన ధ్యాస, శ్రమ కాకుండా ,పరీక్ష వ్రాయుటకు వాడిన కలాన్ని మెచ్చుకున్నారు. దానితో మా తాతగారికి ఆ కలం మీద కోపం కలిగి ,దానిని ఒక మూల పడవేశారట .
కొంత కాలం గడిచిన తరువాత కూడా ఆ కలం గూర్చి ఎవరూ మర్చి పోలేదు. మా తాత ఊరు వదిలి వెళ్ళాక ,అతనిని  గూర్చి మనుష్యులు మర్చిపోయారు .కానీ, ఆ కలం గూర్చి ఎవరూ మర్చి పోలేదు.   పెద్దలందరూ చిన్నపిల్లలకు ఆ కలం గురించి చెప్పే వారు. తన ఊరి మీద కోపంతో ,మా తాతగారు ఉద్యోగం చేయడానికి వెళ్ళి,ఎప్పుడూ ఆ ఊరికి తిరిగి వెళ్ళ లేదు.
చాలా సంత్సరాలు గడిచాక ,ఒకసరి మా నాన్నతో నేను ,మా ముత్తాతను కలవడానికి మా ఊరికి వెళ్ళాను.
మా ముత్తాతకు 90 ఏళ్ళ పై వయసు. అతను సరిగ్గా మాట్లాడడం లేదు. నడవలేరు కూడా.
అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ఊరిపెద్దలు నాకు  ఒక కలం గురించి చెప్పారు. అది మా తాత గారిదని ఎవరూ చెప్పలేదు. ఎవరికీ గుర్తులేదు కాబోలు. అన్ని సంత్సరాలు ఆ కథ చెప్పడంలో ,ఆ కథలో ఇతరకథలు కలగాపులగం అయిపోయాయి. ఆ  కలము వాడిన వాడు అసలు చదువుకొనే వాడు కాదు కానీ ,ఆ కలంతో వ్రాయుటం వలన  అతనికి నూటికి నూరు మార్కులు వచ్చాయని నాకు చెప్పారు.
నేను పదవ తరగతిలో ఉన్నాను. ఇంకా రెండు మూడు నెలలలో మా పరీక్షలు మొదలవుతాయి. మా స్నేహితుడు అసలు చదువుకోడు. తనకి ఆ కలం ఇస్తే బావుంటుందని అనుకొన్నాను .
  కానీ, అటువంటి కలం ఎక్కడనుండి  తీసుకు రావాలో ఎవరికీ తెలియలేదు.  కొనాలన్నా ఆ కలం పేరేమిటో కూడా తెలియదు. ఊరిలో పెద్దలను ఆ కలం పేరడిగితే , దాని పేరు తెలియదు కానీ , దీనిలో ఇంకు మళ్ళీ మళ్ళీ నింపవచ్చని చెప్పారు.
నేను పట్టణానికి తిరిగి వచ్చాక , మా స్నేహితుడికి ఆ కలం గురించి చెప్పాను. 
అతను  వెంటనే ఆ కలం కావాలి అనెను. 
ఆ రోజు నుండి మేము ప్రతి దుకాణానికి వెళ్ళి ,ఇంకు మళ్ళీ మళ్ళీ పోయాల్సిన కలం కోసం అడిగాము. అటువంటి కలాలు ఒకటో  రెండో ఉంటాయనుకొన్నాము. కానీ, ప్రతి దుకాణంలో పది కంటే ఎక్కువ ఉన్నాయి. ఇంక లాభం లేదని మేము నమూనకు ఒక కలం కొన్నము. 
బోర్డు  పరీక్షలకు ముందు జరిగే పరీక్షలలో మా స్నేహితుడు ఆ కలాలను వాడి చూశాడు. కానీ ,మా స్నేహితుడు ఏ పరీక్షలోను పాస్ అవ్వలేదు. 
రోజూ ఆ కలం  కోసం వెతకడంలో  " హీరో " క్యాంలిన్" వంటి కలాల పేర్లను నేర్చుకొన్నాము కానీ , చదువు ఏమీ నేర్చుకోలేదు.
నేను ఇలా రోజూ బయటకు వెళ్ళడం చూసి మా నాన్న నన్ను విషయం ఏమిటని అడిగారు.  నేను తనకు  పూర్తి  కథ చెప్పాను. నేను చెప్పినదంతా విని ,నవ్వి, తన జేబులోనుంచి ఒక కలాన్ని బయటకు తీసారు. "ఆ కలం ఇదే !"అన్నారు. ఆశ్చర్యంతో నేను ఆ కలం తీసుకొని చూస్తే ,దాని మీద "పార్కర్" అని వ్రాసి ఉంది.
ఇంక రెండు రోజుల్లో మా పరీక్షలు. వెంటనే ,నేను మా స్నేహితుడి ఇంటికి పరిగెట్టాను.
తనతో కలిసి దుకాణమునకు వెళ్ళి, దుకాణ దారు ముందు మా దగ్గర ఉన్న యాభై రూపాయలను  పెట్టాము. ఒక పార్కర్ పెన్ను ఇవ్వమని అడిగాము.
అతను నవ్వి, "కేజీ టమటాలే వంద రూపాలు. యాభై రూపాయల్కౌ పార్కర్ పెన్ను  ఎక్కడ దొరుకుతుంది ?" అని అడిగాడు.
అప్పుడు మా ఇద్దరికీ మా తప్పు తెలిసింది. మేము ఎప్పుడూ వంద రూపాయల కంటే  ఎక్కువ ఏ కలం ఉంటుందని అనుకోలేదు. వంద రూపాయలకంటే తక్కువ కావాలని అడిగాం కాబట్టి ఆ ఖరీదైన కలాన్ని ఏ దుకాణ దారు  మాకు చూపెట్టలేదు. ఎంత అడిగినా అతను మాకు ఆ పెన్ను ఇవ్వ లేదు.
అందుకనే ,నేను ఇంటికి వెళ్ళి ,మా నాన్న ను బ్రతిమిలాడాను. ఆ కలాన్ని మా స్నేహితునికి పరీక్షలు వ్రాయడానికి ఇచ్చాను.
పరీక్షలు అయిపోయాయి. ఫలితాలు వచ్చాయి.                                       
అప్పుడు తెలిసింది. 
నేను  మా స్నేహితుడు పరీక్షలలో బాగ చేయ లేదు. మా స్నేహితుడు పాస్ కూడా కాలేదు. 
ఆ  కలం వెతుకులాటలో చిక్కుకు పోయి , చదవడం పూర్తిగా మానివెశాం. మాకు సరియైన శిక్ష. ఆ కలం గురించిన కథ అంతా ఒక మూడ నమ్మకం అని తెలుకొన్నాము. అప్పటినుండి మేము మూఢ నమ్మకాలను నమ్మ కుండా. ఏమి చేసిననూ, శ్రద్ధ, ధ్యేయంలతో చేశాము.
ఆ కలం కోసం నేనూ నా స్నేహితుడు చేసిన ప్రయత్నాలన్నీ జ్ఞాపకం వచ్చినపుడల్లానిపిస్తుంది.
"ఒక చిన్న కలం ఎంత కలకలం రేపిందీ ! "అని.
***

ప్రకృతి ,
పదవ తరగతి ,రిషీ వ్యాలీ పాఠశాల ,3-9-2013
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Thursday, April 11, 2013

ఇదిగిదుగో ఉగాది !

వేప చెట్టు చూడండి
అందమైన చెట్టు అది
ఆకులన్ని పచ్చగా
పువ్వులేమో తెల్లగా
ఒక పువ్వు నోటిలోకి పెట్టుకున్నాను
వెంటనే కళ్ళు తిరిగి పడిపోయాను
ఆ పూతను గిన్నెలోకి వేసుకున్నాను.

చెరుకు గడని చూడండి
చాలా పెద్ద గడ అది
దాని తీపి రసం పిండాకా,
బెల్లం తయారు చేశాకా,
బెల్లం ముక్క తిన్నాను.
పొట్ట నొప్పితో చచ్చాను.
ఆ బెల్లాన్ని గిన్నెలోకి వేసుకున్నాను.


చిన్నచిన్న పొదలు - చిటారి కొమ్మలు -
వాటికి వేలాడి ఉన్నాయి కాయలు
ఆ కాయలు ఎర్రవి, పచ్చవి
కొన్ని చేదువి, కొన్ని వగరువి
ఒకటి నోటిలోకి పెట్టాను.
వగరుదనం వల్ల రోజంతా 
ఏమీ తినలేకపోయాను.
ఆ కాయలు కోసి గిన్నెలోకి 
వేసుకున్నాను.

మిరప పొదలు ఎన్నో ఉన్నాయి.
రంగు రంగుగా కళ్ళకు బాగున్నాయి.
చూద్దామని ఒకటి నోటిలోకి పెట్టాను.
కారంతో మండి చచ్చాను.
ఆ కాయనూ గిన్నెలోకి వేసుకున్నాను.

ఒక మామిడి చెట్టు చూశాను
పచ్చి మామిడికాయ కోశాను.
ఆ పుల్లదనంతో కళ్ళు మూశాను.
అయినా, గిన్నెలోకి వేసాను.

ఇవన్నీ ఒకటొక్కటిగా తినటం కష్టం.
ఆ ఐదు వేరే వేరే రుచులు
వాటిల్ని కలిపితే ఒక అభిరుచి తయారవుతుంది
దాని పేరే ఉగాది పచ్చడి

అలాగే జీవితం 
అన్ని రసాలు కలిసినది
అందుకనే మనం దేముడికి 
ధన్యవాదాలు చెప్పాలి.

*                                                
నివేద్,
9వ తరగతి
రిషీ వ్యాలీ పాఠశాల
*** 
మరికొన్ని పిల్లలకవితలు
 http://chandralata.blogspot.in/
http://www.prabhavaschool.com/

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Saturday, February 9, 2013

ఏడిస్తే...!!!


ఏడవకే నా చిన్ని పాపా!
చుక్కలు చూడు ఓ పాపా!

ఎంతో అందమైన చుక్కలు.
తని తని మెరిసే చుక్కలు

కిల కిల నవ్వుతున్న చుక్కలు
పాప పాప ఓ పాప!
*
జి.అశ్విని
7 వ తరగతి,21.12.2006

*
Prabhava,Books and Beyond ! * All rights reserved.

నేను చేసిన తప్పు


ఒక ఊరిలో ఒక చింత మాను ఉంది. ఆ చింత మానులో కాకి ఉండేది.
కాకి పిచ్చుక రెండూ స్నేహితులు.అవి ఒక రోజు కలిసికొనే గూడు కట్టుకొన్నాయి.
కొన్నాళ్ళకు పిచ్చుక వచ్చి గుడ్లు పెట్టి,గుడ్లపై పొదిగింది.

ఆ కాకి వచ్చి పిచ్చుకను "నేను ఎలా ఇప్పుడు గుడ్లు పెట్టేది ?"అని అడిగింది.
"నేను నీకు ఒక కొత్త గూడు కట్టిస్తాను" అనింది పిచ్చుక.
"సరే! ఈ రోజు కట్టేసి వెళ్ళు." అంది కాకి.
పిచ్చుక పాపం కట్టెలు కంపలు తెచ్చి పెట్టి, గూడు పెద్దది కట్టింది.

కట్టి తన గూడు లోని గుడ్లపై కూర్చుని బాధ పడుతుంది.
"ఇంత వరకు నేను కాకి స్నేహితులుగా ఉన్నాము. ఇప్పుడు నా స్నేహితురాలు ఇలా చేసింది."అని అనుకుంది."మళ్ళీ తనకు అవసరమైనపుడు తానే వస్తుంది "అని తన పిల్లలను పొదుగుకుంది.వాటి కోసం రోజూ పురుగులు ,గింజలు లాంటివి తెచ్చి పెట్టేది.

కాకి ఒక రోజు వాటి పిల్లల కోసం ఆహారం కొరకు పిచ్చుక దగ్గరకు వచ్చింది. పిచ్చుక ఇప్పుడైనా రావాలి అనుకొంది. కాకి వచ్చి బాధతో కూర్చుంది.
"ఏమి?" అని అడిగింది పిచ్చుక.
అనే సరికి కాకి జరిగింది అంతా చెప్పింది.

"నా దగ్గర ఏమీ లేవు .వెళ్ళు ."అని పిచ్చుక కాకిని గట్టిగా అరిచి తరిమేసింది.
అప్పుడు కాకి, "నేను చేసిన తప్పును నేనే సరిచేసుకోవాలి" అనుకుంది.

***
జి.అశ్విని ,7 వ తరగతి,21.12.2006


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Wednesday, February 6, 2013

నేనే గనుక


నేనే గనుక
తేనె పట్టునయితే
తీయతీయని తేనిస్తా
నన్ను రాయితో కొట్టిన వారిని
కని పెట్టుకొని కుడతా!
*
పి. అరుణ్ వర్మ, 7 వ తరగతి,21.12.2006

రిషీవ్యాలీ గ్రామీణ విద్యా కేంద్రం (REC ,Rishi Valley)
*


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Sunday, February 3, 2013

ఏడు గంపలెత్తు !

ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది.ఆ అవ్వ పేరు కాంతమ్మ.
ఆ అవ్వకు ఒక మనవరాలు ఉండేది. ఆమె పేరు వాణి. ఆ పాప రోజు బడికి పోతుండేది.
అవ్వ రోజు అడవికి పోయి ఏడు గంపల విప్పపూలు ఏరుకొని వచ్చేది.
వాణికి సంక్రాంతి సెలవలు ఇచ్చారు.సెలవల్లో అవ్వ ఏడు గంపల విప్పపువ్వు ఎండలో ఆరబోసి ,వాణిని కాపలా పెట్టింది.
అవ్వ మళ్లీ అడవికి పోయింది. వాణి సాయంత్రం అయ్యాక ఏడుగంపల విప్పపువ్వును గంపకెత్తింది.
అంతా ఒక గంపకే సరిపోయింది.
అవ్వ తిరిగి ఇంటికి వచ్చింది.
వాణిని అడిగింది," ఏడు గంపల విప్పపువ్వు ఏది?"
వాణి "ఒక గంపకే ఎత్తాను" అని చెప్పింది.
అప్పుడు అవ్వ,"ఎవరికి ఇచ్చావే, ఈ రొజుకు వదిలేస్తున్నా! రేపటి నుంచి బాగా కాపాలా ఉండు. లేకుంటే నిన్ను ఇంట్లో నుంచి తరిమేస్తా" అని చెప్పింది.
వాణి పాపం తెల్ల వారి నుండి సాయంత్రం వరకు అక్కదే కూర్చుని కాపలా కాస్తుంది. కానీ, అది ఒకే గంపకు అయ్యింది. సాయంత్రం అయ్యాక అవ్వ వచ్చింది.
ఆ గంపనే చూసి ఆ పాపను తరిమేసింది. అవ్వ ఒక రోజు కాపలా కాసింది.
అంతా ఒక బుట్టకు అయ్యింది. అవ్వ తన తప్పు తెలుసుకొని బాధ పడింది.
***
యస్.నాగేశ్వరి, 7 వ తరగతి,  9.1.2007
రిషీవ్యాలీ గ్రామీణ విద్యా కేంద్రం (REC, Rishi Valley)
*
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Tuesday, February 14, 2012

రాగుల్లో ఇసుక


ఒక ఊరిలో ఒక పిల్లవాడు ఉన్నాడు.అతనికి ఒక గుడ్డం ఉంది.దానిలో రాగులు చల్లారు.అతను ఎప్పుడూ గోలీలు ఆడుతుంటాడు.వాళ్ళ నాన్న వచ్చి ఎప్పుడూ గోలీలు ఆడుతుంటాడు.
వాళ్ళ నాన్న వచ్చి," ఎప్పుడూ గోళీలు ఆడుకోకొంటుంటే,రాగి చేని కాటికి పోవచ్చుకదా ?"అందువలన అబ్బాయి తను తరిమి తరిమి అతను అలసిపోయి ,గమ్ముక్కూర్చునేశాడు. గువ్వల్ను తరమ లేక ఏడుస్తున్నాడు.
సరస్వతి పరబ్రహ్మ అటు వెళుతున్నారు. పార్వతి అతని ఏడ్పు విని, ఎందుకని అడిగింది.
"మాకు ఒకేఒక గుడ్డం ఉంది.దానిలో రాగులు చల్లాం.గువ్వలను ఎంత తరిమినా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి.తరిమి తరిమి ,ఇప్పుడు తరమ లేక ఏడుస్తున్నాను"
అప్పౌడు పార్వతి అడిగింది,"ఇక్కడ ఎక్క్డైనా ఇసుక ఉందా ?"
"ఉంది" అనండు ఆ పిల్లవాడు.
ఇసుకకు ఏదో మంత్రం వేసి అతని జేబిలో వేసింది.

"ఏంటి అక్కా ఇది ?" అని అడిగాడు పిల్లవాడు.
"చిలకలు గువ్వలు అన్నీ తింటున్నాయి కదా?అప్పుడు "ఓం భీం" అనుకొని దాన్ల మీద వేయి.అవి చనిపోతాయి"అంది.

గువ్వలు పిట్టలు రాగిచేను పైకి వచ్చాయి.
అప్పుడు పిల్లవాడు ఆ ఇసుకను "ఓం భీం " అని ,పిట్టలపై చల్లాడు.అవి మొత్తం చని పోయాయి. టూవాలులో వేసుకొని ఇంటికి బయలు దేరాడు.అమ్మకు ఇచ్చి కూర చేయ మన్నాడు.మళ్ళీ చేనుకి వెళ్ళాడు.మల్ళీ ఆ పిట్టలు రాలేదు.
ఇంటికి వచ్చి అమ్మను అన్నం పెట్టమని అడిగాడు.
అప్పటికే అమ్మా నాన్న అన్నం తినేసి ,తాంబూలం వేసుకొంటున్నారు. అమ్మ పిల్లవాడికి అన్నం పెట్టి,ఊట వేసింది.
పిల్లవాడికి కోపం వచ్చింది.
తాంబూలం  తింటున్న అమ్మనాన్నలపై "ఓం భీం "అని ఇసుక చల్లాడు.
వాళ్ళు చనిపోయారు.
చేనుకు పొయ్యేవారు లేరు. 
రాగులు పండి పిట్టల దండున పడ్డాయి. 
అమ్మా నాన్న అన్నం ఏమీ లేవు.
ఒక సంచి,గిన్నె,గ్లాసు, ఒక బాటిల్ ఎత్తుకొని. పల్లెల్లో అడక్క తింటున్నాడు.
ఇప్పుడు కూడా ఎప్పుడైనా రాగుల్లో ఇసుక వస్తే అది ఆ పిల్లవాడు చల్లిందే నన్న మాట!

***
పి.పల్లవి,6వ తరగతి,ZPHS పాఠశాల,తెట్టు.
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Thursday, February 9, 2012

ఒక వడ్రంగి పిట్ట




నేను ఒక కొబ్బరి చెట్టును.
అది వేసవి కాలం.
ఒక రోజు నా దగ్గరికి ఒక వడ్రంగి పిట్ట వచ్చి , తన ముక్కుతో పొడిచి పెద్ద రంధ్రం పెట్టింది.
నాకు చాలా నొప్పివేసింది.నేను దానిని భరించాను.
అది రంధ్రంలో 4 రోజులు నివసించి ,4 గుడ్లు పెట్టి తన తండ్రితో వేరే చోటుకు వెళ్ళింది.
కారణం ఆ గుడ్లను అది నాలుగు రోజులు పొదిగింది.పిల్లలు గుడ్లనుంచి రాలేదు. అది బాధ పడి వేరే చోటుకు వెళ్ళింది. నేను ఆ గుడ్లను కొన్ని రోజులు రక్షించాను.
 ఒక రోజు ఒక నరుడు కొబ్బరికాయల కోసం నా మీదికి ఎక్కాడు. కాలు జారి కింద పడ్డాడు.
మరుసటి రోజు మరొక నరుడు ఎక్కాడు.ఆ గుడ్లను చూస్తాడేమో అని చాలా భయ పడ్డాను.నాకు అప్పుడు నరుడు గుడ్లకోసం ఆశ పడడు.కొబ్బరికాయల మీద ఆశ ఎక్కువ  అని ఆలోచన తట్టింది.
నా స్నేహితుడైన చింతచెట్టు కొమ్మలతో గుడ్లు ఉన్న రంధ్రము ను మూసివేశాను. ఆ గుడ్ల మీద ఎవరు చాలా రోజులు దృష్టి ఉంచలేదు. 
తరువాత ఆ  పక్షి తిరిగి నా వద్దకు వచ్చింది.
వరసగా పదకొండు రోజులు గుడ్లను పొదిగింది. అప్పుడు ఆ గుడ్లనుండి నాలుగు పిల్లలు వచ్చాయి.
పక్షి సంతోషించి, తన చెల్లి అయిన కౌజు పిట్టకు ,అక్క అయిన పావురము ను కూడా ఆ చెట్టులోనే గూడు కట్టుకోమని చెప్పింది. 
అప్పటి నుంచి ,నా స్నేహితుడు  అయిన చింత చెట్టు పైనా, నా పైనా   చాలా గూళ్ళు ఉన్నాయి.
అది చూచి నాకు ఎక్కడ లేని సంతోషం కలిగింది.
***
పి .రాజు, 7 వ తరగతి, రిషీవ్యాలీ పల్లె బడి,6.9.11
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.